Tamilnadu: తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడనుంది. ఈ రోజు మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ మరియు తనని కస్టడీలోకి తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైక్టరేట్(ఈడీ) అభ్యర్థన అనే రెండు పిటిషన్‌లపై తీర్పును ఇవ్వనుంది. రవాణా శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మనీలాండరింగ్‌కు పాల్పడిన మంత్రి సెంథిల్ బాలాజీపై అక్రమ నగదు బదిలీ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. జూన్ 13 నుంచి జూన్ 14 తెల్లవారుజాము వరకు సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దాదాపు 18 గంటల పాటు విచారించింది. ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను ఒమందూరార్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
Read also: Al Pacino: ముసలోడే కానీ మామూలోడు కాదు.. 83ఏళ్ల వయసులో నాల్గొసారి తండ్రి అయ్యాడు
అయితే మద్రాస్ హైకోర్టు ఆదేశం ప్రకారం మంత్రిని గురువారం రాత్రి ఒమందూరార్ ఆసుపత్రి నుండి కావేరీ ఆసుపత్రికి మెరుగైన వైద్య చికిత్స కోసం పంపించారు. సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్‌ను మరియు అతనిని కస్టడీలోకి తీసుకుని విచారించడానికి అనుమతి కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి అల్లి గురువారం విచారించారు. అనంతరం సెంథిల్ బాలాజీని వీడియో ద్వారా కోర్టులో హాజరుపరిచారు. బాలాజీ సెంథిల్‌ని ప్రశ్నిస్తూ 15 రోజుల కస్టడీకి సిద్ధమా? అర్ధరాత్రి ఏం జరిగింది? అని న్యాయమూర్తి అల్లి ప్రశ్నించారు.
Read also: Adipurush: థియేటర్ లో హనుమంతుడి సీటుపై వర్మ సంచలన వ్యాఖ్యలు..
మంత్రి సెంథిల్ బాలాజీ మాట్లాడుతూ.. జుడీషియల్ కస్టడీకి వెళ్లడం కుదరదని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెన్నైకి రాగానే తనపై చర్యలు తీసుకుంటామని చెప్పారని.. అతను వచ్చిన రెండు రోజులకే ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరినంత వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నన్ను వేధించిందని మంత్రి చెప్పారు. తాను ఈడీ విచారణకు సహకరించానని చెప్పాడు. బాలాజీ సెంథిల్ తరపున సీనియర్ న్యాయవాది ఎన్‌ఆర్ ఇళంగో హాజరయ్యారు. సెంథిల్ బాలాజీకి వైద్యపరమైన కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టును కోరారు. సెంథిల్ బాలాజీ దంపతుల బ్యాంకు ఖాతా, ఆదాయపు పన్ను ఖాతా వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విశ్లేషించి మొత్తం సమాచారాన్ని సేకరించింది. ఈ విషయాన్ని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజకీయ విధ్వంసానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని.. సెంథిల్ బాలాజీని శస్త్ర చికిత్స కోసం కావేరీ ఆసుపత్రిలో చేర్చేందుకు మద్రాసు హైకోర్టు అనుమతించినందున, అతని శారీరక స్థితిని దృష్టిలో ఉంచుకుని, అతనిని ప్రశ్నించడానికి కస్టడీలో ఉంచకూడద మంత్రి తరపు లాయర్ వాదించారు.