అందరూ ఊహించిన విధంగానే తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి భారత టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లోనే (41; 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా వికెట్స్ పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన నితీశ్.. రిషబ్ పంత్‌తో కలిసి జట్టుకు విలువైన రన్స్ అందించాడు. మొదటి రోజు ఆట ముగిసిన అనంతరం నితీశ్…
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. మొదటి రోజు మ్యాచ్ ఆటను ఎవరూ ఊహించలేదు. పెర్త్‌లో తొలిరోజు మొత్తం 17 వికెట్లు పడ్డాయి. 1952 తర్వాత ఆస్ట్రేలియాలో తొలిరోజు అత్యధిక వికెట్లు పడిన రికార్డు ఇదే. ఈ క్రమంలో తొలిరోజే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో నాథన్ లియాన్, మార్ష్.. పంత్‌ను ఇబ్బంది పెట్టినట్లు అనిపించగా, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో…
తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బరిలోకి దిగాడు. ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకున్న నితీశ్.. అదే ఉత్సహంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ తడబడిన ఆ పిచ్‌పై 41 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అతడే టాప్ స్కోరర్. కీలక ఇన్నింగ్స్…
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన క్లబ్‌లో చేరాడు. టెస్ట్‌ల్లో 3000 పరుగుల మార్కును అందుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ 2024-25 ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రాహుల్ ఈ ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో భారత్ తరఫున మూడు వేల పరుగులు పూర్తి చేసిన 26వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 15921 రన్స్ చేశాడు.…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. ఈ టెస్టులో టీమిండియా తరఫున ఇద్దరు అరంగేట్రం చేశారు. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు తుది జట్టులో స్థానం దక్కింది. ఇప్పటికే టీ20ల్లో అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు నితీశ్… పెర్త్ టెస్ట్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా నితీశ్ టెస్టు క్యాప్‌ను…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా నేడు పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. న్యూజీలాండ్‌పై మాదిరే ఆసీస్‌పై కూడా భారత టాప్ ఆర్డర్ విఫలమైంది. యువ బ్యాటర్స్ యశస్వి జైస్వాల్ (0), దేవదత్ పడిక్కల్ (0) డకౌట్ కాగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ (5) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ (26: 74 బంతుల్లో 3 ఫోర్లు) ఒక్కడే కాస్త పోరాడాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ సమయంలోనే పెర్త్ టెస్టుకు ఓ అరుదైన ఘనత దక్కింది. క్రికెట్ చరిత్రలో ఈ రెండు జట్లకు ఫాస్ట్ బౌలర్లు కెప్టెన్లుగా వ్యవహరించడం ఇదే తొలిసారి. 1947 తర్వాత తొలిసారి ఇరు జట్ల సారథులూ బౌలర్లే కావడం ఇదే మొదటిసారి. భారత జట్టుకు జస్ప్రీత్ బుమ్రా, ఆసీస్‌కు ప్యాట్ కమిన్స్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. 2021 చివరి నుండి ప్యాట్…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్‌లో మొదటి టెస్ట్ ఆరంభం అయింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాలు అరంగేట్రం చేశారు. రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ లేకుండానే భారత్ బరిలోకి దిగింది. ఆశ్చర్యకరంగా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇచ్చాడు. యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు. తొలి టెస్టుకు…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో పెర్త్ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టు పూర్తిగా కుర్రాళ్లతో నిండి ఉంది. తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేస్తున్నారు. గాయపడిన గిల్ స్థానంలో యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం…
ఆస్ట్రేలియా, భారత్ జట్లు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కి సిద్దమయ్యాయి. మరికొద్దిసేపట్లో పెర్త్ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. అయితే ఈ టెస్టుకు వరణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. టాస్ సమయంలో వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజుల్లో పెర్త్‌లో జల్లులు కురిశాయి. మ్యాచ్ తొలిరోజు వర్షం పడే అవకాశం 25 శాతం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. చివరి నాలుగు రోజుల్లో మాత్రం వర్షం పడే…