ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక యాషెస్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు. యాషెస్ 2025-26లో భాగంగా పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్స్ (5/23) పడగొట్టడంతో ఈ రికార్డు స్టోక్స్ ఖాతాలో చేరింది. అంతకుముందు ఈ రికార్డు గుబ్బీ అలెన్ పేరిట ఉంది. అలెన్ 1936లో 5 వికెట్స్ పడగొట్టి 36 రన్స్ ఇచ్చారు. అలెన్ రికార్డును…
Ashes Series 2025: క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘యాషెస్’ (Ashes) సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నేటి (నవంబర్ 21) నుంచి పెర్త్ లోని ఆప్టస్ స్టేడియం వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. నువ్వా.. నేనా.. అన్నట్లు సాగే ఈ చారిత్రక పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2017 నుంచి ప్రతిష్టాత్మక యాషెస్ ‘ఉర్న్’ (Urn) ఆస్ట్రేలియా చేతిలోనే ఉంది. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై…
IND vs AUS Test: భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లోని పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా 295 పరుగులతో విజయం సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచినా టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. అయితే టీమిండియా టాప్ బౌలర్లు ఆస్ట్రేలియా జట్టును కేవలం 104 పరుగులకే ఆలౌట్ చేసారు. దింతో టీమిండియాకు స్వల్ప ఆధిక్యం…
భారత జట్టు స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పెర్త్ టెస్టులో సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఇది అతనికి మొదటి సెంచరీ. ఈ సెంచరీతో కొన్ని రికార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ సిక్సర్‌తో ఈ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టు క్రికెట్‌లో యశస్వికి ఇది నాలుగో సెంచరీ.
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్ తొలిరోజు 150 పరుగులకే పరిమితమైన భారత్, ఆ తర్వాత ఆస్ట్రేలియాను 67 పరుగులకే 7 వికెట్లను పడగొట్టింది. ఇక నేటి రెండో రోజులో భారత్ ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. 67 పరుగుల వద్ద రెండో రోజును మొదలు పెట్టిన ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దింతో టీమిండియాకు 46 పరుగుల…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టుకు భారత జట్టు సారథిగా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. కుమారుడు పుట్టిన కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్టుకు దూరం కాగా.. బుమ్రా జట్టు బాధ్యతలు అందుకున్నాడు. మొదటి టెస్టులోనే బౌలర్‌గానే కాకుండా.. సారథ్యంలోనూ తన ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నాడు. కీలక క్యాచ్ వదిలేసినా అసహనం వ్యక్తం చేయని కెప్టెన్ బుమ్రాపై ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. తొలి టెస్టులో విరాట్ కోహ్లీ…
టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. సేనా దేశాలపై (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అత్యధిక సార్లు అయిదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా 5 వికెట్స్ తీసి ఈ ఘనత అందుకున్నాడు. సేనా దేశాలపై బుమ్రా ఏడు సార్లు ఫైఫర్ పడగొట్టాడు. భారత దిగ్గజం కపిల్ దేవ్ కూడా సేనా దేశాలపై ఏడు సార్లు అయిదు…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆతిథ్య ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆలౌట్ చేశారు. ఓవర్‌నైట్ 67/7 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మరో 37 రన్స్ జోడించి ఆలౌట్ అయింది. టెయిలెండర్స్ మిచెల్ స్టార్క్ (26: 112 బంతుల్లో 2 ఫోర్లు), హేజిల్‌వుడ్ (7 నాటౌట్; 31 బంతుల్లో)తో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. చివరకు హర్షిత్ రాణా వికెట్ తీయడంతో భారత్ ఊపిరి…
పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మొదటిరోజు ముగిసేసరికి 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి.. 4 కీలక వికెట్స్ పడగొట్టాడు. నాథన్ మెక్‌స్వీ, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖావాజా సహా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను అవుట్ చేశాడు. బ్యాటింగ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమై.. డీలా పడ్డ టీమిండియాలో బుమ్రా తన సంచలన…
టీమిండియా తాత్కాలిక కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ నమోదు చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను గోల్డెన్ డకౌట్ చేసిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో స్మిత్‌ను బుమ్రా మొదటి బంతికే అవుట్ చేశాడు. ఎల్బీ రూపంలో గోల్డెన్ డకౌట్ అయిన స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే అతడు రివ్యూ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు.…