ఆస్ట్రేలియా, భారత్ జట్లు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కి సిద్దమయ్యాయి. మరికొద్దిసేపట్లో పెర్త్ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. అయితే ఈ టెస్టుకు వరణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. టాస్ సమయంలో వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజుల్లో పెర్త్‌లో జల్లులు కురిశాయి. మ్యాచ్ తొలిరోజు వర్షం పడే అవకాశం 25 శాతం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. చివరి నాలుగు రోజుల్లో మాత్రం వర్షం పడే అవకాశాలు లేవు.
ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా ఉంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఛానెల్స్‌తో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో మ్యాచులు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. స్టార్ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డీ ఛానెల్‌లతో పాటు స్టార్ స్పోర్ట్స్ 4 తెలుగులోనూ లైవ్ చూడొచ్చు. అయితే ఇందుకోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. హాట్‌స్టార్‌లో చూడాలన్నా డబ్బులు చెల్లించాల్సిందే. ఈ మ్యాచ్‌లను కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీడీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఇక పెర్త్ పిచ్‌పై మంచి పేస్, బౌన్స్ లభిస్తాయి. బ్యాటు మీదికి బంతి చక్కగా వస్తుంది. పిచ్ సమతూకంగా ఉంటుందని, బౌలర్లతో పాటు బ్యాటర్లూ రాణించవచ్చని క్యురేటర్ మెక్ డొనాల్డ్ తెలిపాడు. ఆస్ట్రేలియాలో భారత్ 52 టెస్టులు ఆడగా 7 మాత్రమే గెలిచింది. 13 మ్యాచ్‌లు డ్రాగా కాగా.. ఆసీస్ 30 నెగ్గింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ను భారత్ 4-0తో చేజిక్కించుకుంటేనే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒక్క మ్యాచ్ ఓడినా అవకాశాలు దెబ్బతింటాయి. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆడ్డరపడాల్సి ఉంటుంది.