Nitish Reddy: నా ఆరాధ్య దైవం నుంచి క్యాప్ అందుకోవడం ఆనందంగా ఉంది: నితీశ్ రెడ్డి
- టెస్టుల్లోకి నితీశ్ రెడ్డి అరంగేట్రం
- పెర్త్ వేదికగా మొదటి టెస్టు
- విరాట్ భాయ్ నా ఆరాధ్య దైవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందరూ ఊహించిన విధంగానే తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి భారత టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లోనే (41; 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా వికెట్స్ పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన నితీశ్.. రిషబ్ పంత్‌తో కలిసి జట్టుకు విలువైన రన్స్ అందించాడు. మొదటి రోజు ఆట ముగిసిన అనంతరం నితీశ్ మాట్లాడుతూ.. తన ఆరాధ్య దైవం విరాట్ కోహ్లీ నుంచి క్యాప్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు.
నితీశ్ రెడ్డి మాట్లాడుతూ… ‘నాకు ఇది గొప్ప అనుభూతి. ఎప్పటి నుంచో భారత జట్టుకు ఆడాలని కలలు కంటున్నా. విరాట్ కోహ్లీ నుంచి టీమిండియా క్యాప్ అందుకోవడం ఎంతో అద్భుతమైన క్షణం. నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి విరాట్ భాయ్ నా ఆరాధ్య దైవం. అతని నుంచి టెస్ట్ క్యాప్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. దీనిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు నేను ఆడింది గొప్ప ఇన్నింగ్స్ కాకపోయినప్పటికీ.. నాకు మంచి ఆరంభం దక్కింది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా’ అని చెప్పాడు. విరాట్ అంటే తనకు చాలా ఇస్తామని ఐపీఎల్ ఇంటర్వ్యూలలో నితీశ్ చెప్పిన విషయం తెలిసిందే.
Also Read
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
‘నేను పెర్త్ టెస్టులో అరంగేట్రం చేయనున్నానని మ్యాచ్‌కు ఒక్క రోజు ముందే తెలిసింది. ఇదే విషయాన్ని మేనేజ్‌మెంట్ హర్షిత్ రాణాకు కూడా చెప్పింది. ఆ క్షణాన మా ఇద్దరి ఆనందానికి అవధుల్లేవు. అదే సమయంలో కాస్త భయపడ్డాం కూడా. అయితే ఒత్తిడికి లోనవకుండా ఆస్ట్రేలియాతో అనధికార టెస్టుల్లో ఎలా ఆడామో అలానే ఆడాలని నిర్ణయించుకున్నాం. భారత్-ఏ సిరీస్ నాకు చాలా ఉపయోగపడింది. భారత్‌తో పోలిస్తే పెర్త్ వికెట్‌పై చాలా బిన్నంగా ఉంది. బౌన్స్, ఇతర విషయాల్లో చాలా తేడాలు ఉన్నాయి. మెల్‌బోర్న్ పిచ్ కంటే పెర్త్ పిచ్ బౌలింగ్‌కు బాగా అనుకూలిస్తుందని భావించా. కానీ మెల్‌బోర్న్ లాగానే ఉంది. రిషబ్ పంత్ నాకు మార్గనిర్దేశం చేశాడు’ అని నితీశ్ పేరొన్నాడు.
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!