టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన క్లబ్‌లో చేరాడు. టెస్ట్‌ల్లో 3000 పరుగుల మార్కును అందుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ 2024-25 ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రాహుల్ ఈ ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో భారత్ తరఫున మూడు వేల పరుగులు పూర్తి చేసిన 26వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 15921 రన్స్ చేశాడు.
కేఎల్ రాహుల్ 54 టెస్ట్‌లో 3000 పరుగుల మార్కును దాటాడు. 92 ఇన్నింగ్స్‌ల్లో 3007 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 199. ఇక పెర్త్ టెస్ట్‌లో రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీలు త్వరగా అయిన సమయంలో రాహుల్ సహనంతో ఆడాడు. అయితే థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో పెవిలియన్‌కు చేరాల్సి వచింది. మొదటి ఇన్నింగ్స్‌లో 74 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు.
Also Read: Mechanic Rocky Review: విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ రివ్యూ!
పెర్త్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రెడ్డి (41) టాప్ స్కోరర్. రిషబ్ పంత్ (37), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (11) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ డకౌట్ కాగా.. విరాట్ కోహ్లీ (5), వాషింగ్టన్ సుందర్ (4), హర్షిత్ రాణా (7), జస్ప్రీత్ బుమ్రా (8) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ (4/29) సత్తా చాటాడు.