బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో పెర్త్ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టు పూర్తిగా కుర్రాళ్లతో నిండి ఉంది. తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేస్తున్నారు. గాయపడిన గిల్ స్థానంలో యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు.
స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం దక్కింది. దాంతో సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియాలో మంచి రికార్డు ఉన్న అశ్విన్ ఆడుతాడనుకున్నా.. కెప్టెన్ బుమ్రా మాత్రం సుందర్‌కు ఓటేశాడు. ఇక రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తున్నాడు. కొడుకు పుట్టిన కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ పెర్త్ టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, జోష్ హేజిల్‌వుడ్.