లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గెలిచింది.. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే మంత్రం గెలిచిందన్నారు.
ఈ నెల 4 వ తేదీన వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆందోళన అవసరం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. దేశ ప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోడీ వైపే ఉన్నారని చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. గత కొద్ది రోజులుగా మంచినీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కనీస అవసరాలు తీరక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు తీవ్రమైన ఎండలు.. ఇంకోవైపు నీటి ఎద్దడి..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని (రాజోలు) మామిడికుదురు మండలం పరిధిలోని పెదపట్నం లంకలో రోడ్డెక్కిన గ్రామస్తులు త్రాగు నీరు అందించాలని కాళీ బిందెలతో ఆందోళనకు దిగారు.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలో వేడిగాలులుల తీవ్రంగా వీస్తున్నాయి. మరికొద్ది రోజుల పాటు ఢిల్లీలో వేడిగాలులు విధ్వంసం సృష్టించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Mahbubabad: మహబూబాబాద్ జిల్లాలో చేపల చెరువు లూటీకి గురైంది. వేల సంఖ్యలో గ్రామస్తులు చెరువు దగ్గరకు వచ్చి చెరువులో చేపలను పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నెరడ పెద్ద చెరువులో మత్స్యకారులు చేపల వేట సాగిస్తుండగా,..
సమాజంలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిందితులకు కఠినశిక్షలు విధిస్తున్నప్పటికీ కామాంధులు ఆగడం లేదు. తాజాగా.. జార్ఖండ్ రాష్ట్రంలో ఓ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. చక్రధరపూర్‌లో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు తన ఉపాధ్యాయ పదవికి, సామాజిక, కుటుంబ సంబంధాలకు మచ్చ తెచ్చాడు. 65 ఏళ్ల రిటైర్డ్ టీచర్ తన సొంత మైనర్ మేనకోడలిపై కామ కోరికలు తీర్చుకుని ఎనిమిది నెలల గర్భవతిని చేశాడు. కాగా.. ఈ వ్యవహారం ప్రజలకు తెలవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం (మం) దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు విజయరమణ రావు, మక్కాన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు, గండ్ర సత్యనారాయణ, అడ్డురి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలను స్వామి వారి శేష వస్త్రాలతో మంత్రి శ్రీధర్ బాబు సన్మానించారు. అనంతరం..…
ఓట్లను బహిష్కరిస్తామనే నక్సలైట్ల బెదిరింపు నక్సలైట్ల ఆఖరి కంచుకోట అయిన సరంద మరియు కొల్హన్‌లోని దట్టమైన అడవుల్లో ఉన్న గ్రామాల్లో ఎలాంటి ప్రభావం చూపలేదు. నక్సల్ ప్రభావిత గ్రామాల్లో నిర్మించిన బూత్‌ల వద్ద ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత 20 ఏళ్లుగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన తిరిల్పోసి, రెంగ్‌దహతు, బోరోయి గ్రామాల్లో ఓటింగ్ జరగలేదు. ఈ మూడు గ్రామాల్లో తొలిసారిగా ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉదయం నుంచే ఈ కేంద్రాల…
సంస్కృత భాష అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించిన మీరు ఒడియాకు ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించలేదు అని సీఎం నవీన్ పట్నాయక్ ప్రశ్నించారు. క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఉన్నప్పటికీ ఒడియాను మర్చిపోయారంటూ మండిపడ్డారు. ఒడిస్సీ మ్యూజిక్ కు క్లాసికల్ హోదా కోసం తాను రెండు సార్లు ప్రతిపాదనలు పంపినప్పటికి వాటిని పట్టించుకోలేదని ఆయన విమర్శలు గుప్పించారు.