ఇతర దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్న ప్రజలలో క్రైస్తవుల సంఖ్య అత్యధికంగా 47 శాతం ఉన్నారు. ఆ తర్వాత.. ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు. వలస వచ్చిన వారిలో వారి జనాభా 29 శాతం ఉంది. వలస వెళ్లే వారిలో హిందువులు మూడవ స్థానంలో ఉన్నారు. క్రైస్తవులు, ముస్లింల కంటే కేవలం 5 శాతం మంది హిందువులు మాత్రమే వలస వెళ్లి స్థిరపడ్డారు. అలాగే.. బౌద్ధులు 4 శాతంతో నాల్గవ స్థానంలో ఉండగా.. యూదులు 1 శాతం…
యువతలో గుండెపోటు కేసులు అధికమవుతున్నాయి. రోజుకు ఎక్కడో చోట హార్ట్ ఎటాక్ తో బలవుతున్నారు. తాజాగా.. గుజరాత్ లోని జామ్‌నగర్‌కు చెందిన 19 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ కూడా జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గుండె ఆగిపోయింది. గుండెపోటు రావడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ రెస్టారంట్’ను నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు రూపాయలకే చికెన్ బిర్యానీ అని ప్రకటించడంతో జనం పోటెత్తారు. దాదాపు 2 వేల మంది బిర్యానీ కోసం ఎగబడ్డారు. కానీ, నిర్వాహకులు మాత్రం ఆఫర్ కింద కేవలం 200 బిర్యానీ ప్యాకెట్లను మాత్రమే విక్రయించారు.
2022-23లో వ్యవసాయం, వేట, అటవీ మరియు చేపల వేటలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 25.3 కోట్ల స్థాయికి చేరుకుంది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. గత 17 ఏళ్లలో ఇదే గరిష్ఠ స్థాయి. FY 2022-23 మధ్య వ్యవసాయ ఉపాధి 25 కోట్లను దాటింది. అలాగే.. గత నాలుగేళ్లలో 5 కోట్ల మందికి పనులు లభించాయి. 2022-23లో వ్యవసాయ రంగంలో 48 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. తయారీ, వాణిజ్యంలో 44 లక్షలకు పైగా ఉద్యోగాలు పొందారు.
2024 జూలై 29 వరకు దేశవ్యాప్తంగా 220 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ లోక్‌సభలో తెలిపారు. వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద భారతదేశం 3,012 లక్షల డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌లను 99 దేశాలకు, రెండు UN సంస్థలకు పంపిందని ఆయన చెప్పారు. అలాగే.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచిత సరఫరా కింద కోవిడ్ వ్యాక్సిన్‌ల కొనుగోలు కోసం సుమారు…
ప్రార్థించే పెదవులు కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అన్నారు పెద్దలు. ఈ మాటను అక్షరాల ఆచరణలో పెట్టాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా.. తోడుగా నిలిచాడు.
మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. నూతన ఆరోగ్య బీమా పథకం.. మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్ ఆరోగ్య అభియాన్ (MJPJAY)ని ప్రతి ఒక్కరికీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఈ పథకం వార్షిక ప్రీమియంను 60% పెంచి రూ.3,000 కోట్లకు పైగా పెంచింది. జూలై 1 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది. కొత్త ఆరోగ్య బీమా పథకం కింద.. రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు 1.5…
మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌లో నరమాంస భక్షక రాయల్ అర్బన్ టైగర్ ఎట్టకేలకు అటవీశాఖ అధికారులకు చిక్కింది. అయితే పులిని పట్టుకోవడం కోసం అధికారులు ఎంతో శ్రమించారు. అందుకోసం.. మూడు పులుల సంరక్షణ కేంద్రాల బృందాలు 11 రోజులుగా రెస్క్యూ పనిలో నిమగ్నమయ్యాయి. అంతేకాకుండా.. పులిని పట్టుకునేందుకు 5 ఏనుగులతో పాటు 150 మంది సైనికులు రంగంలోకి దిగారు. ఈ పులి ఒక వ్యక్తిని చంపడంతో 36 గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మొత్తానికి.. రైసెన్‌లో రాయల్ అర్బన్ టైగర్‌ను…
ఈ లోక్ సభ ఎన్నికల ఫలితాలు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ప్రజలు తిరస్కరించినట్లు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆరోపించారు. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించొద్దని వ్యాఖ్యానించారు.