లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గెలిచింది.. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే మంత్రం గెలిచిందన్నారు. ఇక, దేశంలో ఎన్నికల నిర్వహణ ప్రతి ఒక్కరూ గర్వించేలా ఉంది.. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు చెప్పుకొచ్చారు. 1962 తర్వాత మూడోసారి ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాలేదు అని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో ఎన్డీయేకు ప్రజలు పట్టం కట్టారు.. ఒడిశాలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం.. కేరళలో కూడా ఒక సీటు గెలుచుకున్నామని ప్రధాని మోడీ వెల్లడించారు.
Read Also: Anam Ramanarayana Reddy: టీడీపీ కూటమి ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి..
త్వరలోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మన ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం ప్రకటించారు.. ఇది వికసిత్ భారత్ కు లభించిన విజయం.. ఎన్నికల ప్రక్రియపై ప్రజలందరికీ విశ్వాసం ఉంది.. దక్షిణ భారత దేశంలోని తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంచి సీట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. గతంలో తెలంగాణలో వచ్చిన సీట్ల కంటే ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో సీట్లు సాధించామన్నారు. అలాగే, ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో, బీహార్ లో నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ అద్భుత ఫలితాలు సాధించింది అని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలు బీజేపీకి ఓటేసి తమపై ఉన్న నమ్మకానీ వదిలుకోలేదని ప్రధాని మోడీ పేర్కొన్నారు.