Jharkhand: రిటైర్డ్ టీచర్ బాగోతం.. చెప్పుల దండలతో ఊరేగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిందితులకు కఠినశిక్షలు విధిస్తున్నప్పటికీ కామాంధులు ఆగడం లేదు. తాజాగా.. జార్ఖండ్ రాష్ట్రంలో ఓ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. చక్రధరపూర్‌లో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు తన ఉపాధ్యాయ పదవికి, సామాజిక, కుటుంబ సంబంధాలకు మచ్చ తెచ్చాడు. 65 ఏళ్ల రిటైర్డ్ టీచర్ తన సొంత మైనర్ మేనకోడలిపై కామ కోరికలు తీర్చుకుని ఎనిమిది నెలల గర్భవతిని చేశాడు. కాగా.. ఈ వ్యవహారం ప్రజలకు తెలవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై నిందితుడు రిటైర్డ్ టీచర్‌కు చెప్పుల దండలు వేసి ఊరంతా ఊరేగించారు.
కాగా.. రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన సొంత 17 ఏళ్ల మేనకోడలిని ఇంటి పని చేయడం కోసమని తనను తీసుకున్నాడు. అందుకు తన మేనకోడలికి డబ్బులు ఇచ్చేవాడు. అయితే.. ఆదివారం ఉదయం బాలిక తన ఇంట్లో అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయింది. తనకు ఏం జరిగిందో బాలిక కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేకపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను వెంటనే చక్రధర్‌పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్న మైనర్ బాలికను డాక్టర్ పరీక్షించి.. 8 నెలల గర్భవతి అని చెప్పారు. కాగా.. ఈ విషయం వినగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా.. బాలిక స్పృహలో నుంచి బయటకు రాగానే.. గర్భం దాల్చిన కుటుంబ సభ్యులు ఆరా తీశారు.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
PM Modi: మోడీకి ఓటేయొద్దని విద్యార్థులకు చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి అరెస్ట్..
కాగా.. బాలిక భయపడి చాలా సేపటి తర్వాత మాట్లాడింది. తన మామయ్య తనతో బలవంతంగా శారీరక సంబంధాలు పెట్టుకుని గర్భవతిని చేశాడని చెప్పింది. ఒక్కసారి కాదు, చాలాసార్లు శారీరకంగా వాడుకున్నట్లు బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. తన పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మామ తనపై అత్యాచారం చేసేవాడని బాలిక చెప్పింది. ప్రజలకు ఈ విషయం తెలిస్తే.. ఏమవుతుందోనని బాలిక ఎవరికి చెప్పలేకపోయింది. నిందితుడు కూడా బాలిక గర్భం దాల్చుతుందేమోనని.. అబార్షన్ మాత్రలు ఇచ్చేవాడు. కానీ అవి సక్సెస్ కాకపోవడంతో గర్భం దాల్చింది.
బాలికపై శారీరక వేధింపులకు పాల్పడ్డ నిందితుడిపై గ్రామ ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. అతని ఇంటికి చేరుకుని.. ఇంట్లో నుండి బయటకు లాగి చెప్పుల దండ వేసి గ్రామంలో తిప్పారు. అంతేకాకుండా.. తీవ్రంగా చితకబాదారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. మరోవైపు.. మైనర్ బాలికకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!