Komaram Bheem: వీడి కక్కుర్తి తగలెయ్యా ! చనిపోయిన వ్యక్తి పింఛన్ కాజేసిన బీపీఎం..
- కొమురం భీం జిల్లాలో చనిపోయిన వ్యక్తి పెన్షన్‌ను కాజేసిన పోస్టల్ సిబ్బంది..
- విషయం తెలిసిన కుటుంబ సభ్యుల ఆశ్చర్యం..
- తన తల్లికి పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు చేయడంతో బయటపడ్డ బాగోతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komaram Bheem: పోస్టల్ శాఖ బీపీఎం అవినీతిని అధికారులు బట్ట బయలు చేశారు. మూడు నెలల నుంచి అధికారుల కళ్లుగప్పి మృతి చెందిన ఓ వ్యక్తి ఆసరా పింఛన్ డబ్బులు కాజేసిన పోస్టల్ శాఖ బీపీఎం అవినీతిని బయట పెట్టారు. ఈ ఘటన వాంకిడి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కొమురం భీం జిల్లాలో వాంకిడి మండల కేంద్రానికి చెందిన షేక్ మహబూబ్ అనే వ్యక్తి ఆగస్టు నెలలో మృతి చెందాడు. అయితే తన తల్లికి పెన్షన్ మంజూరు కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసారు. అయితే షేక్ మహబూబ్ అనే వ్యక్తిపై పింఛన్ డ్రా చేసినట్లు అధికారులు తెలుపడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. షేక్ మహబూబ్ అనే వ్యక్తి పేరిట జూలై, ఆగస్టు, సెప్టెంబర్, నెలలకు సంబంధించిన మొత్తం 6048 రూపాయలు పింఛన్‌ను డ్రా చేసినట్టు మృతుడి కుటుంబ సభ్యులకు అధికారులు రికార్డులు చూపించారు. దీంతో విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Also Read
- Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్‌కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
- CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తన తండ్రి జూలై నుంచి అనారోగ్యంతో వున్నారని ఆగస్టులో చనిపోయాడని తెలిపారు. చనిపోయిన వ్యక్తి ఎలా పింఛన్ తీసుకుంటాడని ప్రశ్నించారు. మృతి చెందిన వ్యక్తి పింఛన్ కూడా వదలరా? ఇదెక్కడి కక్కుర్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ బీపీఎం (BPM)పై కుటుం సభ్యులు అనుమానం వ్యక్తంచేశారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ బీపీఎం (BPM)పై వాంకిడి మండల అధికారికి మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వాంకిడి మండల అధికారులు బీపీఎం అక్రమాలను ఆరా తీస్తున్నారు.
Copper IUD: లైంగిక జీవితంపై కాపర్ టీ ప్రభావం ఎంతవరకు ఉంటుందో తెలుసా?
తాజావార్తలు
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!