MLA Peddireddy: పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతులకు ఏం మేలుచేస్తాడు అని ప్రశ్నించారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పదవ తరగతి పరీక్ష ఫలితాలను వారం రోజుల్లోనే విడుదల చేయాలని అధికారులపై ఒత్తిడి చేశారని, రీ వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. గతంలో పరీక్షల విధానంలో చిన్న పొరపాట్లు జరిగాయని రామారావు పైన చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెచ్చి గాలి ముద్దుకృష్ణమ నాయడును రాజీనామా చేయించారని, ఇప్పుడు నీ కొడుకు (నారా లోకేష్)ను రాజీనామా చేయమని చెబుతారా?…
వైసీపీ ఐదేళ్ల పాలనలో వేల ఎకరాలు భూదందా చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అన్న మయ్య జిల్లా మదనపల్లె శివారులోని బీకే పల్లెలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి కబ్జా అయిన భూమిని స్వాధీనం చేసుకున్నారు
త్వరలోనే వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా సహా అవినీతి చేసిన అందరూ జైలుకు పోతారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో ఉండే భూములు మొత్తం దోచుకున్నారని, గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన పంది కొక్కులన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయని విమర్శించారు. పెద్దిరెడ్డి అడవిని ఆక్రమించుకొని గెస్ట్ హౌస్‌లు కట్టుకున్నారు, రోడ్లు వేసుకున్నారని మండిపడ్డారు. రోజా డైలాగులు సినిమాలో పనికి వస్తాయని, రాజకీయాల్లో కాదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు.…
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా కుటుంబ సభ్యులపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది. పుంగనూరు నియోజకవర్గం మంగపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు చేపట్టింది. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, తమ్ముడు భార్య ఇందిరమ్మపై కేసు నమోదు చేశారు. మంగళంపేట అటవీ ప్రాంతంలో 28.19 ఎకరాలు ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారుల నిర్ధారించారు. ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు…
ఏపీ పాలిటిక్స్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్ కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్ తాజాగా మరోసారి చర్చనీయాంశం అయింది. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో మొదలైన సెగల సైడ్ ఎఫెక్ట్స్ గురించే తాజా చర్చ. కుప్పం అంటే చంద్రబాబు... బాబు అంటే కుప్పం అన్నంతగా ఈ నియోజకవర్గంతో ఆయనకు బంధం పెనవేసుకుపోయింది. వరుసగా 8 విడతల నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారాయన.
ఎన్నో ఆశలు పెట్టుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీసుకు వచ్చారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో 90 శాతం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పంపిణీ చేశారని.. ఇప్పుడు పిల్లలు కాలేజీలు మానేసి పంట పొలాలకు వెళ్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైసీపీ పోరు కొనసాగిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు పాలన చేస్తోందని, దీనికి పర్యవసానం చెల్లించక తప్పదని పెద్దిరెడ్డి హెచ్చరించారు. మారుతి…
వైసీపీ ఫైర్ బ్రాండ్ ఫైర్ మీద సొంత పార్టీ నేతలే నీళ్ళు చల్లుతున్నారా? రాష్ట్రం మొత్తం రీ సౌండ్‌లో వాయిస్ వినిపిస్తున్నా… సొంత నియోజకవర్గంలోనే ఆమెకు ఎర్త్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? పరిస్థితిని తాత్కాలికంగా సెట్ చేసుకున్నా… ఆ మాజీమంత్రి ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదా? ఎవరా ఫైర్ బ్రాండ్? ఆమెకు వచ్చిన తాజా కష్టం ఏంటి? ఆర్కే రోజా…. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మాజీమంత్రికి ఇప్పటికీ పాలిటిక్స్‌లో…