మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా కుటుంబ సభ్యులపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది. పుంగనూరు నియోజకవర్గం మంగపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు చేపట్టింది. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, తమ్ముడు భార్య ఇందిరమ్మపై కేసు నమోదు చేశారు. మంగళంపేట అటవీ ప్రాంతంలో 28.19 ఎకరాలు ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారుల నిర్ధారించారు. ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read:Jammu and Kashmir: జమ్ము కాశ్మీర్లో మరో ఎన్‌కౌంటర్.. కొనసాగుతున్న ఉగ్ర వేట
భూముల ఆక్రమణపై రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖల అధికారులతో సంయుక్తంగా విచారణ కమిటీ వేసింది ప్రభుత్వం. భూ ఆక్రమణతో రూ. కోటి మేర జీవ వైవిధ్యానికి హాని కలిగిందని సంయుక్త కమిటీ నిర్ధారించింది. మరి కొద్దిరోజుల్లో అటవీశాఖ అధికారులు పాకాల కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. భూ ఆక్రమణలతో పాటు జీవ వైవిధ్యానికి హాని కలిగించేలా వ్యవహరించారని ప్రైమరీ అఫెవ్స్ రిపోర్టు (పీఓఆర్) లో నమోదు చేశారు. ఈనెల 6వ తేదిన కేసు నమోదు చేశారు.