MLA Peddireddy: పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతులకు ఏం మేలుచేస్తాడు అని ప్రశ్నించారు. కోట్లల్లో చిత్తూరు జిల్లాలో టమోటా రైతులు నష్టపోయారు.. తోతపురి కిలో 2 రూపాయలు, 3 రూపాయలు ధరలు పలికితే రైతులు ఎలా బతకాలి అని అడిగారు. ఎన్నిసార్లు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా రైతులకు పట్టించుకోడు.. వ్యవసాయం దండగ అని స్వయానా ఒక సీఎం కూర్చిలో ఉన్న వ్యక్తి మాట్లాడారు అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
Read Also: Reza Shah Pahlavi: ఖమేనీ రాజీనామా చేయాలి.. మళ్ళీ గర్జించిన ఇరాన్ మాజీ యువరాజు
అయితే, ఇలాటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే రైతులకు గిట్టుబాటు ధరలు ఎక్కడ వస్తాయని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో దాదాపు 75 శాతం రైతులు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు.. రైతులకు ప్రభుత్వం చేదోడుగా నిలుస్తుందని అనుకుంటే అందరిని ఉసురు మనిపించింది అని ఎద్దేవా చేశారు. మా ప్రభుత్వంలో రైతుల నుంచి టమోటా కొని రైతులను అదుకున్నాం.. గతంలో రైతులు క్రాప్ హాలిడే అని పెట్టారు.. ఇక నాలుగు సంవత్సరాలు రైతులు సెలవుల్లో ఉండాల్సిందేనని విమర్శించారు. రైతులకు చేయూత ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది.. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు పట్టించుకోవడం లేదని పెద్దిరెడ్డి విమర్శలు గుప్పించారు.