పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల బెడద కిందిస్థాయి కార్యకర్తలకు ఇబ్బందులు తెచ్చి పెడుతోందట. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఓదెలు జడ్పీటీసీ గంటా రాములు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. రెండు గ్రూపులుగా విడిపోయి పార్టీ వేరు కుంపటి పెట్టేశారు. దీంతో ఎవరి వైపు వెళ్లాలో కాంగ్రెస్ శ్రేణులకు అర్థం కావడం లేదట. రాజకీయంగా విజయ రమణారావు, రాములు ఇద్దరు గురు శిష్యులు. గతంలో టీడీపీ ఉన్నవాళ్లే.…
అభం శుభం తెలియని 9 ఏళ్ల చిన్నారి.. వేసవి సెలవులు కదా అని అమ్మమ్మ వాళ్లింటికి వచ్చింది. కానీ ఆమెకు తెలియదు అలా రావడమే ఆమె చేసిన తప్పని.. సమాజంలో తన చుట్టూ నవ్వుతూ తిరుగుతూ అవకాశం రాగానే జింక మీద పులి పడ్డట్లు పడి నమిలి తినేసే కామాంధులు ఉంటారని చిన్నారికి తెలియదు.. తినడానికి అవి ఇస్తాను.. ఇవి ఇస్తాను అని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఒక క్రూర మృగం..…
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ వివాదం టీఆర్ఎస్‌లో అగ్గి రాజేస్తోంది. అధికారులు చేస్తున్నారో లేక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెరవెనక చక్రం తిప్పుతున్నారో అర్థం కావడం లేదన్నది కేడర్ చెప్పేమాట. ఇటీవల మంత్రి హరీష్‌రావు పర్యటనలో జరిగిన నాటకీయ పరిణామాలు ప్రస్తుతం చర్చగా మారాయి. ప్రొటోకాల్ రగడ వర్గపోరు తీవ్రతను బయటపెట్టింది. మంత్రి హరీష్‌రావు ప్రారంభించిన మాతాశిశు కేంద్రం శిలాఫలకంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు కన్నా పైన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేరు చెక్కించారు. దీనిపై కొప్పుల…
పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ సింగరేణిలోని బొగ్గు గనిలో పైకప్పు కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు పనిచేస్తుండగా ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు రాగా ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. తొలుత వారు మరణించారని ప్రచారం జరిగింది. అయితే సోమవారం రాత్రి సమయంలో ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మరో నలుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందం…
దళితుల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్… మతోన్మాద శక్తులు అయిన బీజేపీ ఎంపీలు, నాయకులు కుక్కల్లా అరుస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. భారత రాజ్యాంగాన్ని బీజేపీ రాజ్యాంగంగా మారుస్తున్నారని ఆరోపించారు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు అడ్డుపడ్డ చరిత్ర ఈ బీజేపీ నాయకులుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. 1952 ఎన్నికల్లో అంబేద్కర్ పోటీ చేస్తే అడ్డుకుని పోటీ పెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది…
పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో (రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్) సాంకేతిక కారణాలుతో పాటు పలువురు సిబ్బందికి కరోనా సోకడంతో ఫ్యాక్టరీలో ఉత్పత్తిని యాజమాన్యం నిలిపి వేసింది. ఆర్ఎఫ్‌సీఎల్‌లోని ప్రిల్లింగ్‌టవర్‌లో ఏర్పడ్డ సాంకేతిక అంశాలతోపాటు పలువురు శాశ్వత ఏర్పడ్డ ,ఒప్పంద ఉద్యోగులుకు కరోనా రావడంతో కర్మాగారంలో ఉత్పత్తి పనులను నిలిపివేసినట్టు యాజమాన్యం ప్రకటించింది. Read Also: తెలంగాణలో పలు జిల్లాలకు అదనపు కలెక్టర్ల కేటాయింపు సుమారు 120 మంది ఒప్పంద కార్మికులతో పాటు పలువురు…
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెల్లి శవంతో అక్క నాలుగురోజులుగా సహజీవనం చేస్తోంది. చెల్లి మృతి చెందినట్లు ఎవరికి తెలియనివ్వకుండా ఆమె శవం వద్దే కూర్చొని విలపిస్తోంది. చివరికి ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడడం విషయం బయటపడింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్‌కు చెందిన దంపతులకు స్వాతి, శ్వేత అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం తల్లి చనిపోగా తండ్రి ఇద్దరు కూతుళ్లను…
పెద్దపల్లి జిల్లాలో దారుణం ఉంది. హాస్పిటల్ బాత్రూమ్ లో ఒక బాలింత ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..రొంపికుంటకు చెందిన ఉమ అనే మహిళకు 2009లో వివాహం జరిగింది. ఎన్నో ఏళ్ళ తర్వాత ఈ ఏడాదే ఆమె గర్భం దాల్చింది. డిసెంబర్ 11న ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఆమె మరుసటి రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీసిన వైద్యులు ఆమెకు కుట్లు వేసి 10 రోజులు హాస్పిటలోనే ఉండాలని…
పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.మంథని రెవెన్యూ డివిజన్, కాసిపేట మండలం ఉప్పట్ల గ్రామానికి చెందిన రేణుక (35) భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. గత కొన్ని రోజలుగా భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా తరుచు గొడవలు పడుతు ఉండేవారు. ఈ రోజు కూడా గొడవ పడ్డారు. కాగా మధ్యాహ్నం పెద్దల సమక్షంలో కుటంబ సమస్యలపై పంచాయతీ పెట్టారు. పెద్దలు ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి రాజీ కుదర్చాలని చూశారు. కానీ అంతలోనే ఘోరానికి…
పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌లో విషాదం జరిగింది. రైలుకు ఎదురుగా నిలబడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఒడిశాకు చెందిన వలస కూలీ సంజయ్ కుమార్‌గా అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి రైలులో రామగుండం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వలస కూలీ సంజయ్ కుమార్.. అందరూ చూస్తుండగా ఒక్కసారి ట్రాక్ మీదకు వెళ్లి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా నిలబడ్డాడు. దీంతో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. మృతుడి మానసిక…