అభం శుభం తెలియని 9 ఏళ్ల చిన్నారి.. వేసవి సెలవులు కదా అని అమ్మమ్మ వాళ్లింటికి వచ్చింది. కానీ ఆమెకు తెలియదు అలా రావడమే ఆమె చేసిన తప్పని.. సమాజంలో తన చుట్టూ నవ్వుతూ తిరుగుతూ అవకాశం రాగానే జింక మీద పులి పడ్డట్లు పడి నమిలి తినేసే కామాంధులు ఉంటారని చిన్నారికి తెలియదు.. తినడానికి అవి ఇస్తాను.. ఇవి ఇస్తాను అని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఒక క్రూర మృగం.. నొప్పితో బాలిక విలవిలాడుతున్నా పట్టించుకోకుండా తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. ఓదెల మండలం ఉప్పరపల్లిలో ఒక జంట నివాసముంటుంది. వేసవి సెలవులు కావడంతో ఆ జంట తమ మనవరాలిని ఇంటికి తెచ్చుకొని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఆ ఇంటిపక్కనే రమేష్ (38) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఏ కామాంధుడు కన్ను చిన్నారిపై పడింది. గురువారం చిన్నారి అమ్మమ్మ ఉపాధి హామీ కూలి పనికి వెళ్లగా.. చిన్నారి ఒక్కత్తే ఇంట్లో ఆడుకుంటుంది. ఇక ఇదే అదునుగా భావించిన రమేష్.. బాలిక వద్దకు వెళ్లి మాట కలిపాడు. తరువాత తినడానికి ఇస్తానని చెప్పి లోపలి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఆమెను అక్కడే వదిలి పరారయ్యాడు. ఇక బాలిక కేకలు విన్న చుట్టుపక్కల వారు హుటాహుటిన వచ్చి చూడగా నగ్నంగా బాలిక ఏడుస్తూ కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలికను వైద్య పరీక్షల కొరకు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అనంతరం రమేష్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.