పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే ప్రేమించిన యువతి గొంతుకోసి పరారయ్యాడు.. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. రామగుండం 8ఎంక్లైన్ కేకే నగర్ లో ఈ దారుణం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే కేకే నగర్ లో నివాసముంటున్న ఒక యువతిని ప్రేమ పేరుతో రాజు అనే యువకుడు వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని ఆమె వెనుక గత కొంతకాలంగా తిరుగుతుండగా.. ఆమె అతని ప్రేమను నిరాకరించింది. దీంతో…
నటి పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా ‘RX 100’తో టాలీవుడ్‌కు పరిచయం అయింది. తొలి సినిమాలో హాట్ హాట్‌గా నటించి సెగలు రేపిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తన నటనతోనూ మంచి మార్కులు కొట్టేసింది. మొదటి సినిమాతో మరిన్ని అవకాశాలు వచ్చిన.. సరైన హిట్ రాకపోవడంతో వెనకబడిపోయింది. కథ డిమాండ్ మేరకు ఏ పాత్రకు అయినా సై అంటుంది ఈ బ్యూటీ.. ప్రత్యేక సాంగ్ లోను పాయల్ అప్పుడప్పుడు మెరుస్తోంది. ఇదిలావుంటే, ఈ అమ్మడు ప్రస్తుతం…
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు మీడియా సమావేశం నిర్వహించారు. ఈమేరకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత, సంతోష్ రావులపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన విమర్శలను పుట్ట మధు ఖండించారు. మంథని నియోజకవర్గంలో చీకటి పాలనను అంతమొందించడానికి కవిత చేసిన కృషి మరువలేమన్నారు. కవిత ఏనాడు ముఖ్యమంత్రి కూతురుగా కాకుండా ప్రజల పక్షాన ఉంది, ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. సమస్యలపై స్పందించే విధానాన్ని చూసి టిబిజికెఎస్ నేతలు…
బిజేపిలోకి ఈటల వస్తున్నాడన్న వార్తతో పార్టీలో నూతన ఉత్సాహం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈటల చేరికపై ఫుల్ బిజీగా ఉన్న తెలంగాణ బిజేపికి షాక్ తగిలింది. పెద్దపల్లి బిజేపిలో ముసలం నెలకొంది. మాజీ ఎంపీ వివేక్ పై అసంతృప్తి నేతలు తిరుగుబాటుకు దిగారు. ఈ రోజు మంచిర్యాలలో అసమ్మతి నేతలు సమావేశం కానున్నారు. వివేక్ తీరుపై మాజీ మంత్రి బోడ జనార్ధన్, మాజీ ఎమ్యెల్యేలు గుజ్జుల రామకృష్ణ రెడ్డి, సోమారపు సత్యనారాయణ తదితర నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు…
పెద్దపల్లి జిల్లా రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లోని టాటా కంపెనీకి చెందిన స్టోర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నూతనంగా నిర్మాణంలో ఉన్న సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ లోని టాటా ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్ షెడ్ డౌన్ కావడంతో ఉదయం నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా కరెంట్ సప్లై కావడంతో టాటా స్టోర్స్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలక్ట్రానిక్…
కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేసిన నలుగురిని పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని గోదావరిఖని గంగా నగర్ ఏరియాలో లారీ డ్రైవర్ ను కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేసిన నలుగురిని డీసీపీ రవీందర్ అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 9 వేల నగదు, ఏటీఎం కార్డులు, కత్తి, బైక్ ను వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు చాకచక్యంగా చేధించిన వన్ టౌన్ సీఐలు రమేష్ బాబు, రాజ్ కుమార్…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సమయంలో.. ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. దీంతో.. త్వరిత గతిన ఆక్సిజన్ తరలింపునకు ప్రత్యేక రైళ్లు, విమానాలు నడుపుతోంది ప్రభుత్వం.. అయితే, ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. శనివారం హైదరాబాద్ నుండి చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ కి వెళ్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ల గూడ్స్ రైలులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి.. అది గమనించిన సిబ్బంది.. పెద్దపల్లి జిల్లా సమీపంలోని 38వ గేటు వద్ద…
పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అరెస్ట్ అయ్యారు. జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధును భీమవరంలో అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే పుట్టమధును ఏ కేసులో అరెస్ట్ చేశారో పోలీసులు మాత్రం చెప్పలేదు. ఏ కేసులో పుట్ట మధును అరెస్ట్ చేశారో చెప్పడానికి పోలీసులు నిరకరించినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. గత కొన్ని రోజులుగా పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్నారు. నిన్న మధు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో…