రైల్వే గేటు దాటే క్రమంలో పలు వాహనాలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కొందరు నిర్లక్ష్యంగా రైల్వే గేటు దాటుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రైల్వే సిబ్బంది విదుల్లో నిర్లక్ష్యం కారణంగా కూడా రైలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లాలో ప్రమాదం తప్పింది. పెద్దపల్లి పట్టణ సమీపంలోని కూనారం రైల్వే గేట్ వద్ద ఓ కారు రైల్వే పట్టాలపై ఆగిపోయింది. కారు గేటు దాటకముందే రైల్వే సిబ్బంది గేటు వేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. Also Read:Akhanda2…
Railway Line : దాదాపు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రామగుండం-మణుగూరు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రైల్వే శాఖ నుండి చివరకు ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ లభించింది. ఈ నిర్ణయంతో పెద్దపల్లి ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. రైల్వే సమస్యల పరిష్కారంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి ఫలిస్తున్నదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వంశీ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఇప్పటికే సిద్ధమైందని, సుమారు రూ. 4 వేల…
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో గల చెక్ డ్యాము ను గుర్తు తెలియని దుండగులు పేల్చివేశారు. గుంపుల మానేరు వద్ద గల చెక్ డ్యాం ను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు పేల్చివేయడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పెన్షన్ వచ్చిందని వృద్ధురాలిని నమ్మించి మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడు చోరీ చేశాడు ఓ అగంతకుడు. మాయ మాటలు చెప్పి రూ. 4,000 పెన్షన్ మంజూరు అయ్యిందని ఫొటో దించాలని నమ్మబలికి దొంగతనానికి పాల్పడ్డాడు. వృద్ధురాలితో మాట్లాడిన దృశ్యాలు సీసీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు శంకరమ్మ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:Hamas:…
ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఓ మహిళ.. తనకంటే చిన్న వయస్కుడైన యువకుడిని ప్రేమించింది. యువకుడి ప్రేమలో మునిగిపోయిన మహిళ.. ఇద్దరు పిల్లలు ఉన్నారనే సంగతే మర్చిపోయింది. విషయం భర్తకు తెలియండంతో ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. భర్త, పిల్లలను కాదనుకున్న ఆ మహిళ.. తనకు ప్రియుడే దిక్కని నిశ్చయించుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన సంధ్య…
పెళ్లి కాని యువతీ యువకులే కాదు.. పెళ్లైన వారు కూడా ప్రేమ పేరుతో కొత్త సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబాలను రోడ్డునపడేసుకుంటున్నారు. కొందరు అవమాన భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఇది మరింత పెరిగింది. ఫేస్ బుక్, ఇన్ స్టా పరిచయాలు అక్రమ సంబంధాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఇద్దరు వివాహితులు ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆ తర్వాత అడ్డంగా బుక్కై పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు…
గడ్డం వంశీకృష్ణ.. పెద్దపల్లి ఎంపీ. 35 ఏళ్లకే లోక్‌సభలో అడుగుపెట్టారీ పొలిటికల్ వారసుడు. కాకా కుటుంబం నుంచి పెద్దపల్లి సీట్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న మూడో తరం నాయకుడు. అంతవరకు బాగానే ఉందిగానీ.. ఇప్పుడాయన వ్యవహారశైలి గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. అటు పార్టీ కార్యక్రమాల్లో, ఇటు ప్రభుత్వ ప్రోగ్రామ్స్‌లో ప్రోటోకాల్ ప్రకారం పిలుపులు ఉండటం లేదన్నది ఎంపీ అనుచరుల ఆరోపణ. ఐడెంటిటీ సమస్య కావడంతో ఆగ్రహంతో ఉన్నారట ఎంపీసాబ్.
వాటర్ క్యాన్ ఓ యువకుడి ప్రాణం తీసింది..! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వాటర్ క్యాన్ మూలంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. బావిలో ఈత కొట్టేందుకు యువకుడు వాటర్ క్యాన్ డబ్బాను కట్టుకొని ఈతకు వెళ్లగా.. ఆ క్యాన్ కు హోల్ పడి నీళ్లు లోనికి వెళ్లి ఆ యువకుడు నీట మునిగి మరణించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది..
పెద్దపల్లి జిల్లా.. కోల్ బెల్ట్ ఏరియాతో పాటు అటు పారిశ్రామికంగానూ.. ఇటు వ్యవసాయ పరంగానూ ప్రాధాన్యత ఉన్న ప్రాంతం.... తెలంగాణ ఏర్పడ్డాక ఈ జిల్లాలో గణనీయమైన విజయాలు సాధించింది బీఆర్‌ఎస్. రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాలు పూర్తిగానూ, ధర్మపురి పాక్షికంగానూ ఈ జిల్లా పరిధిలో ఉన్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లా పరిధిలో ఒక్క సీటు కూడా గులాబీ పార్టీకి దక్కలేదు.
Bandi Sanjay : పెద్దపల్లిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్థలంలో దారుసలామ్ మీటింగ్ పెట్టడం అన్యాయమే కాదు, పేద ముస్లింలకు గుణపాఠం చెబుతోందని మండిపడ్డారు. ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పేద ముస్లింల పొట్ట కొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. వక్ఫ్ బిల్లును పేద ముస్లింల కోసం తీసుకువచ్చినట్లు చెప్పిన సంజయ్, “బడాబాబులు, బడా చోర్లు కలిసి హైదరాబాద్లో…