పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భారత సిబ్బందిలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దోవల్ పేర్కొన్నారు. యుద్ధం భారత్ తమ ఛాయిస్ కాదని ఆయన నొక్కి చెప్పారు.
భారతదేశం పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు. ఇరు దేశాల DGMO (డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్)ల మధ్య చర్చల తర్వాత ఇది సాధ్యమైంది. అసలు భారతీయ డీజీఎమ్ ఎవరు? అతని పని ఏంటో తెలుసుకుందాం.. డీజీఎమ్‌ఓ అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్. ఇది సైన్యంలో ఒక ముఖ్యమైన, బాధ్యతాయుతమైన పదవి. ప్రస్తుత భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. అన్ని సైనిక కార్యకలాపాల బాధ్యత డీజీఎమ్‌ఓదే. ఏదైనా సైనిక చర్య, మార్గనిర్దేశం చేయడం,…
భారత్, పాక్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఈ అంశంపై పాక్ మంత్రి స్పందించారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తక్షణ కాల్పుల విరమణను ధృవీకరించారు. భారతదేశం -పాకిస్థాన్ మధ్య కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయంపై ఇరు దేశాలు అంగీకరించాయి. “పాకిస్థాన్-భారత్ తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాకిస్థాన్ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను రాజీ పడలేదు. దేశంలో శాంతి, భద్రత కోసం…
పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ తర్వాత దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాత్రి కాగానే డ్రోన్లు, క్షిపణులతో భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలే లక్ష్యంగా పాకిస్థాన్ జరుపుతున్న దాడులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మరోవైపు.. సరిహద్దుల్లో కాల్పులకు కూడా గట్టిగా బదులిస్తోంది. అదే సమయంలో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత దళాలు భీకరదాడులకు దిగాయి. రెండు దేశాల…
Minister Seethakka : తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘ఆపరేషన్ కగార్’పై కేంద్ర ప్రభుత్వం తన పట్టును కొనసాగిస్తూ, 20వేల మంది భద్రతా సిబ్బందితో కర్రిగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యులను పట్టుకునేందుకు గట్టి పోరాటం చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా, సీఆర్‌పీఎఫ్ (CRPF) దళాలు బుధవారం కర్రిగుట్టపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. అయితే, అక్కడ పర్మినెంట్ బేస్ క్యాంపుల ఏర్పాటు కోసం భద్రతా దళాలు సన్నాహాలు…
మావోయిస్టు పార్టీ లో ఉన్న తెలంగాణ వాసులందరూ లొంగిపోవాలని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.. తెలంగాణ పోలీసులు కర్రెగుట్టలో ఎలాంటి ఆపరేషన్స్ నిర్వహించట్లేదని స్పష్టం చేశారు.. కేంద్ర బలగాల నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.. వెంకటాపురం ఏరియాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని కేంద్ర బలగలు మోహరించి ఆపరేషన్ నిర్వహిస్తున్నారన్నారు..
కొద్ది సమయం కాల్పుల విరమణకు రష్యా సమ్మతించింది. స్థానిక కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి భారతీయ, ఇతర విదేశీయుల తరలింపునకు అంగీకరించింది రష్యా. అయితే, ఉక్రేయిన్ ఒప్పుకుంటేనే అది సాధ్యమని షరతు విధించింది. ఖార్కివ్, కివ్, మరియుపోల్, సుమీ నగరాల్లో చిక్కుకుపోయున వారిని తరలించేందుకు రష్యా అంగీకారం తెలిపింది. రష్యా ప్రతిపాదనను తిరస్కరించింది ఉక్రెయిన్. రష్యా ప్రతిపాదించిన మార్గాలన్నీ నేరుగా రష్యాకు లేదా, రష్యా మిత్ర దేశం బెలారస్ కు దారితీసేయుగా…
ప్రపంచం ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రెండు దేశాల మధ్య శాంతి చర్యలు జరగనున్నాయి. గత రెండు విడతల చర్చలు విఫలం అయ్యాయి. పశ్చిమ దేశాల రష్యాపై ఆంక్షలు విధించడం యుద్దం ప్రకటించడం లాంటిదేనన్నారు అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ. ఉక్రెయిన్ గగనతలాన్ని “నో ఫ్లై జోన్” గా ప్రకటించే ప్రయత్నం…
రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధంలో ఇరుదేశాలు భారీ నష్టాన్నే చవిచూశాయి. ఉక్రెయిన్పై ఎనిమిది రోజులుగా సాగిస్తోన్న యుద్ధానికి సంబంధించిన వివరాలను రష్యా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. యుద్ధంలో ఇప్పటివరకు 498 మంది సైనికులను కోల్పోయామని రష్యా ప్రకటించింది. 16 వందల మంది రష్యా సైనికులు గాయపడ్డారని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఉక్రెయిన్కు చెందిన ఎస్-300, బీయూకే-ఎం1 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైల్ వ్యవస్థను రష్యా ధ్వంసం చేసింది. పలు మిలటరీ హెలికాప్టర్లు, నాలుగు డ్రోన్లను నేలకూల్చింది.…
ఉక్రెయిన్-రష్యా వార్ ఉధృతంగా సాగుతోంది.. మరోవైపు శాంతి చర్చలకు కూడా సిద్ధం అవుతున్నారు.. మొదటి విడత చర్చలు విఫలం కావడంతో.. బెలారస్లో రెండవ విడత శాంతి చర్చల కోసం ప్రతినిధులను పంపామని చెబుతోంది రష్యా.. అయితే, రష్యా చర్చలు జరపాలనుకుంటే వెంటనే దాడులు ఆపాలని డిమాండ్ చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. దీంతో, చర్చలు ఉంటాయా? లేదా? అనేది ప్రశ్నగా మారింది.. మరోవైపు, రష్యా దాడులు మొదలైన తర్వాత 9 లక్షల మందికి పైగా ప్రజలు…