భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. గురువారం పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంతో శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని.. ఇందులో కాశ్మీర్ అంశంపై కూడా ఉందని పేర్కొన్నారు. శాంతి చర్చలకు రావాలని ఆహ్వానించారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ పదేపదే స్పష్టం చేస్తున్నా షరీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
షెహబాజ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఎయిర్ స్టాఫ్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ వైమానిక స్థావరాన్ని సందర్శించారు.
ఇది కూడా చదవండి: Varun Tej : భార్య కోసం చెఫ్ గా మారిన వరుణ్.. ఏం చేశాడంటే..?
ఏప్రిల్ 22న హహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది హిందువులు చనిపోయారు. దీంతో భారత్ ప్రతీకార చర్య చేపట్టింది. మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ దాడుల్లో పాకిస్థాన్‌లో భారీగా నష్టం జరిగింది. అయితే పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ గురువారం సందర్శించడం ఇది రెండోసారి కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Off The Record: ఈటల రాజేందర్ బీజేపీలో ఒంటరి అయ్యారా?
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ భారీ నష్టాన్ని చవిచూసినట్లు సమాచారం. వైమానిక స్థావరాలు దెబ్బతినడంతో పాటు 50 మంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అలాగే నియంత్రణ రేఖ వెంబడి జరిపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఇక మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అప్పటి నుంచి ఉద్రిక్తతలు తగ్గి ప్రశాంత వాతావరణం నెలకొంది.