కొద్ది సమయం కాల్పుల విరమణకు రష్యా సమ్మతించింది. స్థానిక కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి భారతీయ, ఇతర విదేశీయుల తరలింపునకు అంగీకరించింది రష్యా. అయితే, ఉక్రేయిన్ ఒప్పుకుంటేనే అది సాధ్యమని షరతు విధించింది. ఖార్కివ్, కివ్, మరియుపోల్, సుమీ నగరాల్లో చిక్కుకుపోయున వారిని తరలించేందుకు రష్యా అంగీకారం తెలిపింది.
రష్యా ప్రతిపాదనను తిరస్కరించింది ఉక్రెయిన్. రష్యా ప్రతిపాదించిన మార్గాలన్నీ నేరుగా రష్యాకు లేదా, రష్యా మిత్ర దేశం బెలారస్ కు దారితీసేయుగా ఉన్నాయని ఉక్రెయిన్ తిరస్కరించింది. బెలారస్-పోలెండ్ సరిహద్దులో రష్యా, ఉక్రెయిన్ ల మధ్య జరిగిన మూడవ విడత చర్చలు జరిగాయి. సభ్యత్వాన్ని ఇవ్వాలని చేసిన ఉక్రెయిన్ అభ్యర్థనను రానున్న రోజుల్లో చర్చించనుంది యూరోపియన్ యూనియన్. రష్యా కు వ్యతిరేకంగా వాణిజ్యంపై నిషేధంతో పాటు, మరిన్ని కఠినమైన అంతర్జాతీయ ఆంక్షలను విధించాలని కోరుతున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.