Ukraine-Russia: సోమవారం ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచం ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రెండు దేశాల మధ్య శాంతి చర్యలు జరగనున్నాయి. గత రెండు విడతల చర్చలు విఫలం అయ్యాయి. పశ్చిమ దేశాల రష్యాపై ఆంక్షలు విధించడం యుద్దం ప్రకటించడం లాంటిదేనన్నారు అధ్యక్షుడు పుతిన్.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ. ఉక్రెయిన్ గగనతలాన్ని “నో ఫ్లై జోన్” గా ప్రకటించే ప్రయత్నం చేస్తే యుద్ధంలోకి దిగినట్లేనని హెచ్చరించింది రష్యా. రష్యా యుద్దం వల్ల ఇప్పటికే సుమారు 15 లక్షల మంది శరణార్ధులను పశ్చిమ దేశాల వైపు యూరోపియన్ యూనియన్ లోకి వెళ్ళేట్లు చేసింది.
Also Read
ఇదిలా వుంటే చర్చలకు రెడీ అవుతున్న వేళ ఉక్రెయిన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది రష్యా. ఇప్పటివరకూ జరిగిన చర్చలకు ఉక్రెయిన్ ప్రతినిధిగా వచ్చిన డెనిస్ కిరీవ్ ను ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ కాల్చి చంపిందని రష్యా పేర్కొంది. రష్యాకు సమాచారం లీక్ చేస్తున్నాడన్న ఆరోపణలతో డెనిస్ కిరీవ్ ను అరెస్ట్ చేసేందుకు ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ప్రయత్నించారని, ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో కిరీవ్ మరణించాడని రష్యా వర్గాలు తెలిపాయి.రష్యా-ఉక్రెయిన్ మధ్య బెలారస్ లో చర్చలు జరిగిన సమయంలో డెనిస్ కిరీవ్ చివరిసారిగా దర్శనమిచ్చాడు. అయితే, అతడిని సెక్యూరిటీ దళాలు కాల్చి చంపాయన్న రష్యా ఆరోపణలపై ఉక్రెయిన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!