మావోయిస్టు పార్టీ లో ఉన్న తెలంగాణ వాసులందరూ లొంగిపోవాలని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.. తెలంగాణ పోలీసులు కర్రెగుట్టలో ఎలాంటి ఆపరేషన్స్ నిర్వహించట్లేదని స్పష్టం చేశారు.. కేంద్ర బలగాల నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.. వెంకటాపురం ఏరియాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని కేంద్ర బలగలు మోహరించి ఆపరేషన్ నిర్వహిస్తున్నారన్నారు.. తెలంగాణలో ఎలాంటి మావోయిస్టుల కదలికలు లేవని తెలిపారు.. శాంతి చర్చలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఉందని చెప్పారు. మావోయిస్టులు లొంగిపోతే పారితోషకం, రివార్డులు వెంటనే ఇస్తున్నామని గుర్తు చేశారు.. వాళ్లకి ఉపాధి కల్పించేలా చేస్తామని హామీ ఇచ్చారు..
READ MORE: Pakistan: భారత్తో వైరం వద్దు.. పరిష్కారం వెతకండి.. పాక్ ప్రధానికి సోదరుడి సూచన
ఇప్పటివరకు 252మంది మావోయిస్టులు లొంగిపోయరని ఐజీ వెల్లడించారు.. తెలంగాణలోకి మావోయిస్టులు ఎంట్రీ కాకుండా మా భద్రత బలగాలు గస్తీ కాస్తున్నారని తెలిపారు..
ఏ రాష్ట్రం వారైనా మావోయిస్టులు లొంగుబాటు కావొచ్చని స్పష్టం చేశారు.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం వారే ఎక్కువగా లొంగిపోయారని చెప్పారు.. వారికి ఇబ్బందులు లేకుండా అనారోగ్య పరిస్థితులు ఉన్న తామే చుసుకుంటున్నామన్నారు.. ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చిన తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.. లొంగిపోయే మావోయిస్టులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
READ MORE: GT vs RR: “డూ ఆర్ డై” మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..