IPL 2025 Final Live Updates: అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఐపీఎల్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. అయితే, ఈ రెండు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2025 తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఐపీఎల్ నాకౌట్ చరిత్రలోనే బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని ఆర్‌సీబీ ఖాతాలో వేసుకుంది. క్వాలిఫయర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 101 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆర్‌సీబీ 10 ఓవర్లలో రెండు వికెట్స్ మాత్రమే కోల్పోయి సునాయాస విజయం సాధించింది. ఇక ఎన్నో రోజులుగా వేచిచూస్తున్న ఐపీఎల్ టైటిల్‌కు ఆర్‌సీబీ అడుగు దూరంలో నిలిచింది.…
విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటాడు. సహచరులు అయినా, ప్రత్యర్ధులు అయినా.. అందరినీ ఆటపట్టిస్తుంటాడు. ఒక్కోసారి దురుసుగా కూడా ఉంటాడు. కీలక మ్యాచ్‌లలో అయితే స్లెడ్జింగ్ చేస్తూ హద్దులు దాటుతుంటాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్.. యువ ఆటగాడిపై విరాట్ స్లెడ్జింగ్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పంజాబ్…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో గురువారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని, పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడటంలో బ్యాటర్లు విఫలమయ్యారన్నాడు. తాము తక్కువ స్కోర్ లక్ష్యంగా విధించామని, బౌలర్లను ఏమాత్రం నిందించలేం అని చెప్పాడు. మ్యాచ్ వైఫల్యంపై అధ్యయనం చేయాలన్నాడు. ఇది మర్చిపోలేని రోజు అని శ్రేయాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. క్వాలిఫయర్‌లో ఆర్‌సీబీకి ఎక్కడా కూడా పంజాబ్…
ఇంకా ఒక్క మ్యాచే మిగిలి ఉందని, కలిసి సంబరాలు చేసుకుందామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ అభిమానులకు పిలుపునిచ్చాడు. చిన్నస్వామి స్టేడియమే కాదు.. ఎక్కడ మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీపై ఆదరణ చూపిస్తున్నందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఫాస్ట్ బౌలర్లు పిచ్‌ను బాగా ఉపయోగించుకున్నారని, స్పిన్నర్ సుయాశ్ శర్మ బౌలింగ్ అద్భుతం అని పాటీదార్ ప్రశంసించాడు. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 ఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్…
ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ ముల్లాన్‌పుర్‌లో రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు చేరడం ఇది పదోసారి. ఇప్పటివరకు బెంగళూరు మూడు ఫైనల్స్‌లో ఆడింది కానీ.. ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయింది. 2016లో చివరిసారిగా ఫైనల్‌కు చేరిన ఆర్‌సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో ఈసారి టైటిల్ లక్ష్యంగా ముందుకు దూసుకెళుతోంది. క్వాలిఫైయర్ 1లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న…
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు పంజాబ్, బెంగళూరు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడతాయి. పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న గుజరాత్, ముంబై టీమ్స్ ఎలిమినేటర్‌లో ఢీకొంటాయి. క్వాలిఫయర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్‌కు చేరుతుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో (ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో మ్యాచ్)…
ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్‌కు వేళైంది. నేడు ముల్లాన్‌పుర్ (చండీగఢ్)లో తొలి క్వాలిఫయర్ జరగనుంది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడనున్నాయి. క్వాలిఫయర్ 1లో విజేతగా నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మాత్రం ఫైనల్లో చోటు కోసం ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 2లో తలపడాల్సి ఉంటుంది. బెంగళూరు, పంజాబ్ జట్లు మంచి ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో హోరీహోరీ…
ఐపీఎల్ 2025లో లీగ్ దశ పూర్తయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (118 నాటౌట్; 61 బంతుల్లో 11×4, 8×6) సెంచరీ చేశాడు. లక్ష్యాన్ని ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జితేశ్ శర్మ (85 నాటౌట్; 33 బంతుల్లో…
IPL 2025 Final: ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ లో తలపడే రెండు జట్లు అంటూ భారత మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ బాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప తన అభిప్రాయాన్ని తెలిపాడు. రాబిన్ ఉతప్ప అభిప్రయం ప్రకారం.. ఈ సీజన్ ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుందని అతని అభిప్రాయం వ్యక్తం చేశాడు.…