IPL 2025 Final: ఫైనల్‌లో తలపడేది ఆ రెండు జట్లే.. జ్యోతిష్యం చెప్పిన టీమిండియా మాజీ ప్లేయర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Final: ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ లో తలపడే రెండు జట్లు అంటూ భారత మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ బాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప తన అభిప్రాయాన్ని తెలిపాడు. రాబిన్ ఉతప్ప అభిప్రయం ప్రకారం.. ఈ సీజన్ ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుందని అతని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Read Also: Preity Zinta: హద్దులు దాటిన ఆనందం.. ప్రీతి జింటా సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా.. వీడియో వైరల్
Also Read
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ఇకపోతే, పంజాబ్ కింగ్స్ తాజాగా ముంబై ఇండియన్స్‌పై ఘన విజయంతో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచింది. ఆ జట్టు 14 మ్యాచుల్లో 19 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌కి చేరింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో లక్నోపై గెలిచితే వారు కూడా టాప్ ప్లేస్‌కి వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే, వారికి నెట్ రన్‌రేట్ కీలకంగా మారనుంది.
ఈ సందర్భంగా రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ.. టోర్నమెంట్ చివరి దశకు వచ్చే సరికి జట్టు దగ్గర సరైన మోమెంటం ఉండటం చాలా ముఖ్యం. పంజాబ్ సీజన్ మొదట్లో అదిరిపోయే ఆరంభం చేసింది. మధ్యలో కొద్దిగా జారిపోయినా, ప్లేఆఫ్స్ ముందు మళ్లీ ఫామ్‌కి వచ్చింది. జట్టులోని బ్యాటింగ్ లైనప్ ఎంతో బలంగా ఉందని ఇది పంజాబ్‌కి కలిసొచ్చే అంశమని అన్నాడు. అంతేకాకుండా శ్రేయాస్ అయ్యర్ ను కూడా ఉతప్ప పొగిడాడు.
Read Also:Obesity in children: పిల్లల్లో పెరుగుతున్న స్థూలకాయం.. పరిష్కార మార్గాలు లేవా..?
శ్రేయాస్ ఎప్పుడూ మంచి కెప్టెన్.. KKRలోనూ అతను విలువైన కాప్టెన్సీ చేశాడు. కానీ, అక్కడ అతనికి తక్కువ గుర్తింపు లభించింది. ఇప్పుడు పంజాబ్‌కి వచ్చి 11 ఏళ్ల తర్వాత జట్టును ప్లేఆఫ్స్‌కి తీసుకెళ్లడం గొప్ప విషయం. ఇది అతని నాయకత్వ గుణాలను చూపిస్తుందని అన్నాడు. మొత్తానికి, రాబిన్ ఉతప్ప అభిప్రాయం ప్రకారం ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు జరుగుతుందని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..