Virat Kohli: నీళ్లు అందిస్తాడు అంటూ.. యువ ఆటగాడిపై విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్!
- ఇంపాక్ట్ ప్లేయర్‌గా ముషీర్ ఖాన్
- యువ ఆటగాడిపై విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్
- కోహ్లీని ఆడేసుకుంటుంన్న ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటాడు. సహచరులు అయినా, ప్రత్యర్ధులు అయినా.. అందరినీ ఆటపట్టిస్తుంటాడు. ఒక్కోసారి దురుసుగా కూడా ఉంటాడు. కీలక మ్యాచ్‌లలో అయితే స్లెడ్జింగ్ చేస్తూ హద్దులు దాటుతుంటాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్.. యువ ఆటగాడిపై విరాట్ స్లెడ్జింగ్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ సమయంలో ముషీర్ ఖాన్ మైదానంలోని తమ జట్టు ఆటగాళ్లకు వాటర్ బాటిల్స్ అందించాడు. పంజాబ్ మిడిల్ ఆర్డర్ విఫలమవడంతో ముషీర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. అతడికి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. ముషీర్ క్రీజులోకి వచ్చిన సమయంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ.. యువ ఆటగాడిపై స్లెడ్జింగ్ చేశాడు. ‘యేతో పానీ పిలాతా హై’ (ఇతగాడు ఆటగాళ్లకు నీళ్లు అందిస్తాడు) అంటూ ఎద్దేవా చేశాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ కోహ్లీని ఆడేసుకుంటుంన్నారు. స్టార్ బ్యాటరై ఉండి యువ ఆటగాడిని అలా అనడం కోహ్లీకి సరికాదు, కోహ్లీ స్థాయికి ఇది తగదు, యువ ఆటగాళ్లను ప్రోత్సహించాల్సింది పోయి స్లెడ్జింగ్ చేయడం ఏంటి అని మండిపడుతున్నారు.
Also Read
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఈ మ్యాచ్‌లో ముషీర్ ఖాన్ విఫలమయ్యాడు. 33 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. స్పిన్నర్ సుయాష్ శర్మ అతడిని ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. సర్ఫరాజ్ ఖాన్ సోదరుడే ముషీర్ ఖాన్ అన్న విషయం తెలిసిందే. దేశవాళీల్లో సత్తాచాటిన ముషీర్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. 2025 మెగా వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. 8.2 ఓవర్లలో 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి సమయంలో ముషీర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చాడు. యువ ఆటగాడి మనసును మళ్లించే ప్రయత్నంలో భాగంగానే విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ చేసి ఉంటాడని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
Virat Kohli saying “Ye to Paani pilata hai” to young Musheer Khan.
What a shameless person he is still laughing even after saying. 😭😭 pic.twitter.com/usrMJ2NGiz
— Shana⁴⁵🐐 (@shana45__) May 30, 2025
THE GAME CHANGER OF RCB RCB – SUYASH SHARMA.!!!
– Gets Shashank Singh, Musheer Khan & Marcus Stoinis.!!
– Congratulations RCB.!!!
— MANU. (@IMManu_18) May 29, 2025
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..