IPL 2025 Playoffs: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్.. క్వాలిఫయర్, ఎలిమినేటర్‌లో తలపడే టీమ్స్ ఇవే!
- ఐపీఎల్ 2025లో లీగ్ దశ పూర్తి
- పంజాబ్, బెంగళూరు మధ్య క్వాలిఫయర్ 1
- ఎలిమినేటర్‌లో తలపడనున్న గుజరాత్, ముంబై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో లీగ్ దశ పూర్తయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (118 నాటౌట్; 61 బంతుల్లో 11×4, 8×6) సెంచరీ చేశాడు. లక్ష్యాన్ని ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జితేశ్ శర్మ (85 నాటౌట్; 33 బంతుల్లో 8×4, 6×6) , విరాట్ కోహ్లీ (54; 30 బంతుల్లో 10×4)లు హాఫ్ సెంచరీలు బాదారు. అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో బెంగళూరు టాప్-2లోకి దూసుకెళ్లింది.
చివరి లీగ్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ లెక్క తేలింది. పంజాబ్ కింగ్స్ 19 పాయింట్లతో పట్టికలో టాప్ ప్లేస్ దక్కించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 19 పాయింట్లనే సాధించినప్పటికీ.. రన్‌రేట్ కారణంగా రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ (18), ముంబై ఇండియన్స్ (16 పాయింట్లు) మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. టాప్ 2లో ఉన్న పంజాబ్, బెంగళూరు క్వాలిఫయర్ 1లో తలపడతాయి. గుజరాత్, ముంబై టీమ్స్ ఎలిమినేటర్‌లో ఢీకొంటాయి. ఇక క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ గెలిచిన టీమ్ క్వాలిఫయర్ 2లో పోటీపడతాయి. తొలి క్వాలిఫయర్ (మే 29), ఎలిమినేటర్ (మే 30) మ్యాచ్‌లకు ముల్లాన్‌పూర్.. క్వాలిఫయర్ 2 (జూన్ 1), ఫైనల్ (జూన్ 3)కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
Also Read
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ ఇలా:
క్వాలిఫయర్ 1: పంజాబ్ vs బెంగళూరు (మే 29)
ఎలిమినేటర్: గుజరాత్ vs ముంబై (మే 30)
క్వాలిఫయర్ 2: క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు vs ఎలిమినేటర్ గెలిచిన టీమ్ (జూన్ 1)
తాజావార్తలు
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!