మూడో జాబితాలో మరికొన్ని కీలక పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్.. దేవాలయాల పాలక మండళ్లపై కసరత్తు పూర్తి చేశారు.. 222 మార్కెట్ యార్డ్ కమిటీల జాబితా సిద్ధం అవుతోందట.. చైర్మన్ పదవులకు 2 నుంచి 3 పేర్ల ప్రతిపాదనలు రాగా.. ఈ వారంలో పదవుల భర్తీకి సన్నాహాలు సాగుతున్నాయి.. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లను భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది సర్కార్..
నియోజకవర్గాల పునర్విభజనపై ఆహ్వానం వచ్చింది.. కానీ, హాజరు కాలేమని సమాచారం ఇచ్చామని జనసేన ప్రకటించింది.. చెన్నైలో డీఎంకే.. నియోజకవర్గాల పునర్విభజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం వచ్చింది.. అయితే, హాజరుకాలేమని సమాచారం అందించామని పేర్కొంది..
నిధి అగర్వాల్.. చిన్న హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ నుంచి ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయ్యింది నిధి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో ‘మజ్ను’ మూవీ చేసింది. ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ అందుకున్న నిధి, ఈ సినిమాలో…
నేను హిందూ ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన ఇతర మతాలు ఇబ్బంది పడేలా మాట్లాడను.. అసమానతలను వెతుక్కోను, అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటా.. సనాతన ధర్మాన్ని పటిస్తాను, అన్ని మతాలను గౌరవిస్తా అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు (మార్చ్ 22) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.. ఉదయం 9.05 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 9.45 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు పవన్..
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధించిన ఘనత సీఎం చంద్రబాబు దే అన్నారు. కల్చరల్స్ చూస్తూ నేను చేసిన గబ్బర్ సింగ్ సినిమా గుర్తొచ్చింది.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతలా నవ్వడం ఎప్పుడూ చూడలేదు.. చంద్రబాబు లాంటి బలమైన నాయకుడిని కడుపుబ్బ నవ్వేలా చేసారు అని పేర్కొన్నారు.
AP Deputy Speaker: విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లెజిస్లేచర్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు దుర్యోధనుడి వేషధారణలో నటించి అదరగొట్టారు.
మెగాస్టార్ చిరంజేవి యూకే పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందిస్తున్న నేపథ్యంలో ఆయన తమ్ముడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ, తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని, నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి. ఆయన…
నేడు దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30కు విజయవాడ నుంచి ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు. సాయంత్రం 6.30కి సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కుమారుడి రిసెప్షన్కు హాజరవుతారు. ఈరోజు రాత్రికి ఇద్దరు ఢిల్లీలోనే బస చేస్తారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసే…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యునివర్సిటీస్ యాక్ట్- 2016 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది కేబినెట్.. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నంబూరు, పెద్ద కాకానికి బ్రౌన్ ఫీల్డ్ క్యాటగిరి కింద అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది..