Pawan Kalyan: పదవి ఉన్నంతకాలం.. నా జీతం మొత్తం మీకోసమే!
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న పవన్ కల్యాణ్
- జీతం మొత్తం పిఠాపురం నియోజకవర్గం అనాధ పిల్లలకు
- ప్రభుత్వం, పదవి ఉన్నంతకాలం జీతం మొత్తం అనాధ పిల్లల సంక్షేమానికే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తన వేతనం మొత్తాన్ని పిఠాపురం నియోజకవర్గ అనాథ పిల్లల సంక్షేమానికి వినియోగించనున్నట్లు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో 42 మంది అనాధ పిల్లలకు నెలకు రూ.5000 చొప్పున తన వేతనం నుండి అందిస్తానని ప్రకటించారు. మిగిలిన జీతం కూడా వారి బాగోగుల కోసమే ఖర్చు పెడతానని పవన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం, పదవి ఉన్నంతకాలం ప్రతి నెల ఒకటో తేదీన 42 మందికి రూ.5000 చొప్పున అందిస్తానని హామీ ఇచ్చారు.
Also Read: Raghunandan Rao: చంపుతూ పోతుంటే చూసుకుంటూ పోవాలా.. ఉగ్రవాదులను చంపితే వీళ్లకేంటి నొప్పి?
Also Read
శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 32 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున ఆర్థిక సాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందించారు. మిగతా పది మందికి డబ్బులు అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ‘పిఠాపురం నియోజకవర్గ ప్రజలు నమ్మకంతో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత. పిఠాపురం ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన వేతనాన్ని అక్కడే వినియోగించాలనుకున్నా. నియోజకవర్గం పరిధిలో తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డల భవిష్యత్తు కోసం ఇస్తా. ప్రభుత్వం, పదవి ఉన్నంతకాలం నా జీతం మొత్తాన్ని అనాధ పిల్లల సంక్షేమానికి వినియోగిస్తా’ అని చెప్పారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!