ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరి కాసేపట్లో సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. ఈ సారి కూడా కేబినెట్ ముందు కీలక అంజెండా ఉంది.. సీఆర్డీఏ ఆథారిటీలో అమోదించిన 37,702 కోట్ల టెండర్ల గాను పనులు చేపట్టేందుకు అమోదం తెలపనుంది కేబినెట్.. ఇక, కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయనుంది సీఆర్డీఏ.. ప్రస్తుతం సీఆర్డీఏ చేపట్టనున్న రూ.22,607 కోట్ల విలువైన 22 పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది..…
జాతీయ ఉపాధి హామీ పథకంపై తాను ప్రత్యేక దృష్టి పెట్టానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతిని గుర్తించామని, రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, అవినీతి కి పాల్పడ్డ కొంతమందిని సస్పెండ్ చేశామన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.…
Cm Chandrababu : సీఎం చంద్రబాబు అధ్యక్షుతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులతో సమావేశం నిర్వహిస్తారు సీఎం చంద్రబాబు. ఈ మీటింగ్ లో కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. మరీ ముఖ్యంగా అమరావతి కోసం సీఆర్డీఏ కింద రూ.37,072 కోట్ల టెండర్ల పనులపై చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ ఎంఈ పార్కుల నిర్మాణంపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇవే…
Nithin : యంగ్ హీరో నితిన్ తాజాగా రాబిన్ హుడ్ మూవీతో రాబోతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని నితిన్ పట్టుదలతో ఉన్నాడు. శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్లు పెంచేశారు. అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో నితిన్ కు యాంకర్ కొన్ని ప్రశ్నలు వేసింది. టాలీవుడ్ హీరోల ఫొటోలు చూపిస్తూ వీరి నుంచి ఏం దొంగిలిస్తారు అని…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలుపు విషయమై నాగబాబు కావాలనే అలాంటి వ్యాఖ్యలు చేశారా? పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను కించపరిచే ఉద్దేశ్యం ఉందన్న ప్రచారంలో నిజమెంత? అసలా కామెంట్స్ని వర్మ ఎలా తీసుకుంటున్నారు? తెలుగు తమ్ముళ్ళు ఏమంటున్నారు? ఈ రచ్చ ఇక్కడితో ఆగుతుందా? లేక కథలో ఊహించని మలుపులు ఉండబోతున్నాయా? లెట్స్ వాచ్. జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. ఆయన ఆ మాటల్ని…
పాక్లో వరస దాడులు.. బలూచిస్తాన్లో ఆర్మీ కన్వాయ్పై ఎటాక్.. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో మరోసారి దాడి జరిగింది. ఇప్పటికే జఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటనలో పాకిస్తాన్ తన పరువును కోల్పోయింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ వణికిపోతోంది. ఇదిలా ఉంటే, తాజాగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) మార్గంలో పాకిస్తాన్ బలగాలకు చెందిన కాన్వాయ్ లక్ష్యంగా శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం, బహుళ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది.…
పవన్ కళ్యాణ్ హిందీ భాష గురించి చేసిన కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. “మీ హిందీ భాషను మా మీద రుద్దకండి”, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం”, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి అని ముందు ట్వీట్ చేయగా ఇప్పుడు మరోసారి ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ పాత ట్వీట్లను తవ్వితీసి “గెలవక ముందు “జనసేనాని”,…
జగన్ కమిడియన్ అయితే.. మరి నువ్వేంటి? అని ఎమ్మెల్సీ నాగబాబును మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "నువ్వు, మీ అన్న, మీ తమ్ముడు ముగ్గురూ రాజకీయాల్లోకి వచ్చారు. మీ అన్న ఎలాగోలా కాంగ్రెస్లో చేరి మంత్రి అయ్యాడు. శాసనసభకు రావడానికి మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి పదహారు సంవత్సరాల సమయం పట్టింది. అది కూడా చంద్రబాబు నాయుడు సంక ఎక్కితే ఎమ్మెల్యే అయ్యారు.
ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం.. రెండూ మన భారతదేశం యొక్క జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న జనసేన సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందించారు. తాజాగా పవన్ వారికి ఎక్స్ వేదికగా సమాధానం చెప్పారు.
ఇంత సైంటిఫిక్గా కుల గణన ఎప్పుడూ జరగలేదు.. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణపై నిబద్ధతతో ఉన్నామని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు చేసిన ఘనత తమ సీఎం, ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. బీసీ కుల గణన లెక్కలు తప్పు అంటున్నారు.. ఇంత సైంటిఫిక్గా కుల గణన ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు. 1931 తర్వాత.. ఇప్పుడు తాము చేశామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. బీసీలకు…