ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మృత్యువాత పడ్డారు. పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి ప్రాణాలు తీయడంతో భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని ముక్తకంఠంతో నినదించింది. తాజా దాడులతో బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారత వైమానిక దాడులపై స్పందించారు.
Also Read:Ind-Pak Tensions To Impact IPL: భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025పై ఎఫెక్ట్!
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “పెహల్గాంలో టూరిస్ట్ లను చంపారు..హిందువు కాదా అని అడిగి మరి చంపారు.. చనిపోయిన వాళ్ళలో ఆంధ్రకు చెందిన వాళ్ళు ఇద్దరు చనిపోయారు.. హిందువా కాదా అని తెలుసుకోవడానికి ఖల్మ చదవమని అడిగారు.. సామాన్య జనాలకు ఇబ్బంది కాకుండా నిన్న రాత్రి తీవ్రవాదులను చంపారు.. కాశ్మీర్ అనేది దేశంలో భాగం.. 1990లో కాశ్మీర్ పండిట్ లను చంపారు.. అంత్యక్రియలను చేయడానికి వచ్చిన వారిని చంపారు.. సరైన సమయంలో ఆర్మీ సరైన నిర్ణయం తీసుకుంది..లుంబినీ పార్కు,గోకుల్ చాట్ లాంటి ఘటనలు చూసాము.
Also Read:Operation Sindoor: భారత్ మెరుపు దాడి.. హఫీజ్ ఉగ్రవాద స్థావరం నుంచి మృతదేహాలు వెలికితీత
మిలిటరీ యుద్ధం చేస్తుంటే మనం ఏమి చేయాలో అది తెలియాలి దాని కోసమే మాక్ డ్రిల్ కార్యక్రమం.. దేశ ద్రోహులకు సరైన సమాధానం చెప్పాలి…పోలీస్ అధికారులకు పిర్యాదులు చేయాలి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్మీ పై అనుచిత వ్యాఖ్యలు చేయకండి.. పార్టీలతో సంబంధం లేకుండా దేశ ప్రజలంతా ప్రధాని మోదీకి సపోర్ట్ గా ఉండాలి.. నేను అందరినీఉద్దేశించి మాట్లాడలేదు.. కొద్ది మంది కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడాను.. పాకిస్తాన్ కు ప్రోత్సాహకంగా మాట్లాడకండి” అని వెల్లడించారు.