రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు, అత్యాచారాలు, హత్యలపై మీరు ప్రశ్నించకుండా.. రప్పా.. రప్పా.. అంటూ మీడియా ముందుకు వచ్చేసారని పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు సీదిరి అప్పలరాజు.. చంద్రబాబు చేస్తున్న మోసాలు, వెన్నుపోటు గురించి ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్.. గుర్తు పెట్టుకో.. నిన్ను అధహ్ పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు.., నా పార్టీ జనసేనే కాదు.., ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఇవి. అయితే, అది పవన్ వల్ల జరిగిందా? లేక ఇతరత్రా అన్ని కారణాలు కలిసి కొట్టాయా అన్నది వేరే సంగతి గానీ... మొత్తం మీద ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది.
వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవేవో మాట్లాడిన పిఠాపురం పీఠాధిపతి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కనబడటం లేదని విమర్శించారు. శ్రీ సత్యసాయిలో ఈరోజు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ‘డిప్యూటీ సీఎం’ పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కనిపించారా? అంటూ శ్యామల ప్లకార్డ్ ప్రదర్శించారు. పవన్ గురించి శ్యామల చేసిన కామెంట్స్ ఇప్పుడు…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలు, ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. చట్టాన్ని ఉల్లంఘించే విధంగా మాట్లాడే నేతలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సినిమాల్లో చెప్పే డైలాగులు సినిమా హాళ్ల వరకే బాగుంటాయని, ఆ డైలాగులను ప్రజాస్వామ్యంలో ఆచరణలో పెట్టడం సాధ్యపడదన్నారు. ఎవరు అయినా సరే చట్టాన్ని, నియమ నిబంధనలను గౌరవించాల్సిందే అని తెలిపారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని హెచ్చరించారు.…
Tamil Nadu: తమిళనాడు మధురై జిల్లాలో జరగనున్న ‘‘మురుగన్ సదస్సు’’ను ఉద్దేశిస్తూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకే బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ కార్యక్రమం మతం, జాతి, భాష పేరుతో ప్రజలను విభజించడానికి రూపొందించారని విమర్శించింది. జూన్ 22న జరిగే ఈ సదస్సుకు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ వంటి ఇతర రాష్ట్రాల నేతలు రావడాన్ని ప్రశ్నించింది.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కు భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ఎప్పుడో ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై మరే ఇతర సినిమాలకు లేనటువంటి గందరగోళం నెలకొంది. ఇప్పటికే దాదాపు 13 సార్లు రిలీజ్ వాయిదా…
బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య, పెండెం దొరబాబు.... అందరూ అందరే. అంతా సీనియర్ లీడర్సే. కొందరు రాష్ట్ర స్థాయిలో, కొందరు నియోజకవర్గంలో చక్రాలు తిప్పేసిన వారే. అంతకు ముందు వైసీపీలో ఉన్నప్పుడు వాయిస్ రెయిజ్ చేసిన వారే. కానీ... కాలం మారింది. పరిస్థితులు మారిపోయాయి.... సదరు లీడర్స్ స్వరాలు మూగబోయాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫుల్ వాల్యూమ్‌లో ఫ్యాన్ కిందినుంచి పక్కకు వచ్చేసి టీ గ్లాస్ పట్టుకున్నారు ఈ నేతలంతా.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఇటీవల పూర్తయింది. అంతా సిద్ధంగా ఉన్న ఈ సినిమా రిలీజ్ కావాల్సిన సమయంలో వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. సినిమా ఎప్పుడు వస్తుందనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. Also Read:Nagababu: పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు అణుశక్తి…
ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్.ఆర్.ఐ. జన సైనికులు, వీర మహిళలతో వర్చువల్ సమావేశంలో శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి పాలన ప్రజలకు చేరువైందన్న ఆయన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి రూ.308 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పశువుల కోసం…
CM Chandrababu: యోగాంధ్ర ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఏపీ సర్కార్ తీసుకుందని చెప్పుకొచ్చారు.