నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్టర్‌గా చేస్తున్న అఖండ 2 సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ కూడా ఉంది. నిజానికి, ఈ సినిమాను సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడు సినిమా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:Kalki 2898 AD : ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ కు ‘కల్కి’ నామినేట్..
ఎందుకంటే, సెప్టెంబర్ 25వ తేదీన పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా కూడా రిలీజ్‌కు షెడ్యూల్ అయి ఉంది. అయితే, ఆ సినిమాతో పోటీ పడడం పెద్ద సమస్య కాదు, కానీ అంతకు ముందు వారం, అంటే సెప్టెంబర్ 18వ తేదీన, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇది కూడా పెద్ద అభ్యంతరం కాదు, కానీ అసలు సమస్య సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ విషయంలో ఉంది.
Also Read:Lokesh Kanagaraj : రజినీకాంత్ కు చెప్పిన కథ వేరు.. తీసింది వేరు : లోకేష్
ఈ సినిమా ఎక్కువ భాగం వీఎఫ్ఎక్స్ షాట్స్ ఆధారంగానే గ్రాండియర్‌ను సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, అనుకున్న సమయానికి వీఎఫ్ఎక్స్ పనులు పూర్తవుతాయా లేదా అనే విషయంపై అనుమానాలు ఉన్నాయి. టీమ్ ప్రస్తుతానికి సినిమాను సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేసేలా ఫైనల్ డెడ్‌లైన్ పెట్టుకుని పని చేస్తోంది. కానీ, ఆగస్టు నెలాఖరు వరకు రిలీజ్ గురించి క్లారిటీ రాకపోవచ్చు. కాబట్టి, ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం కష్టమే.