పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వాటిలో ఒకటి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన హరిహర విరామల్లు. సూర్య చిత్ర బ్యానర్ పై ఏ ఎం రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. అన్ని హంగులు ఫినిష్ చేసుకుని ఈ నెల 24న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మరో చిత్రం సుజిత్ డైరెక్ట్ చేసిన OG. డీవివి దానయ్య నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ కు రెడీ అవుతోంది.
Also Read : Bollywood : ఇదేంట్రా.. సీక్వెల్స్ ను కూడా రీమేక్ చేస్తున్న బాలీవుడ్
ఇప్పుడు ఈ రెండు సినిమాలకు సంబంధించి థియేట్రికల్ రైట్స్ డీల్స్ క్లోజ్ చేస్తున్నారు. అయితే OG సినిమా రైట్స్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. సాధారణంగా ఏ సినిమా అయినా ఆంధ్రలో ఓవరాల్ ధరను ఫిక్స్ చేసే రేట్ ను బట్టి ఒక్కో ఏరియా ఎంత అనేది పర్సెంటేజ్ వారీగా రేటు ఫిక్స్ అవుతుంది. కానీ గట్టి పోటీ వుండడం వల్ల విశాఖ,ఈస్ట్, గుంటూరు మూడు ఏరియాలు రెండు నుంచి మూడు పర్సంట్ పెంచినా కూడా డిమాండ్ తగ్గడం లేదట. ఇక హరిహర విరమల్లు పరిస్థితి మరోలా ఉంది. బడ్జెట్ వ్యయం పెరగడంతో నిర్మాత రత్నం కాస్త ఎక్కువగానే కోట్ చేస్తున్నాడు. కానీ ఆ రేట్ కాదని నిర్మాతతో బేరాలు ఆడుతున్నారు బయ్యర్స్. ఏదేమైనా ఒకటి మాత్రం వస్తవం. హరిహర వీరమల్లు అంటే అంతంత మాత్రంగా ముందుకు వస్తున్న బయ్యర్స్ OG కోసంఎగబడుతున్నారు.