పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిన్నారు. ఇటీవల రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
Also Read : Rajni : సూపర్ హిట్ దర్శకుడితో సూపర్ స్టార్
ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా రిజల్ కాబోతున్న ఈ సినిమా నేడు సెన్సార్ కార్యక్రమాలు ఫినిష్ చేసుకుంది. మొత్తం 162 మినిట్స్ అనగా రెండు గంటల 42నిమిషాల రన్ టైమ్ తో యూ/ఏ సర్టిఫికెట్ తో ఫైనల్ వర్షన్ ను లాక్ చేసారని సమాచారం. సినిమా వీక్షించిన సెన్సార్ టీమ్ నుండి హరిహర టీమ్ కు ప్రశంసలు లభించాయి. చారిత్రక నేపధ్యాన్ని చక్కగా చుపించారని దర్శకుడిని అభినందించారని తెలుస్తోంది. చాలా కాలంగా పవర్ స్టార్ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆయన ఫ్యాన్స్ కు హరిహర ఓక ఫీస్ట్ లా ఉండబోతుందని యూనిట్ బలంగా నమ్ముతోంది. నేడు సెన్సార్ టీమ్ అభినందించడంతో వారి నమ్మకం రెట్టింపైంది. ఇదే జోష్ లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సన్నాహకాలు చేస్తున్నారు. అందుకోసం వైజాగ్ వేదిక కాబోతుంది. ఈ నెల 20న హరిహర ప్రీ రిలీజ్ వేడుకకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు రాజామౌళి ముఖ్య అతిదిగా రానున్నారు.