మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ రీ-ఎంట్రీ తర్వాత మాస్టర్ అనే మాస్ అండ్ క్లాస్ మూవీ చేశారు. సురేశ్ కృష్ణ దర్శకత్వంలో అల్లు అరవింద్ దాన్ని నిర్మించారు. ఇప్పుడు అన్న చిరు అడుగుజాడల్లో నడవబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందించబోతున్న పీ.ఎస్.పీ.కే. 28లో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్ర పోషించబోతున్నాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్లో పోలీస్ ఆఫీసర్ గా దుమ్ములేపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడీ సినిమాలో లెక్చరర్…
వకీల్ సాబ్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. కోవిడ్ లాంటి పరిస్థితిలోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తరువాత హరీష్ శంకర్ మైత్రీ మూవీస్ కాంబినేషన్లో రాబోతోన్న సినిమా కోసం సిద్దంగా ఉన్నారు. ఇక బండ్ల గణేష్ ఓ సినిమాను పవన్ కళ్యాణ్తో నిర్మించేందుకు రెడీగా ఉన్నారు. అయితే బండ్ల గణేష్ నిర్మించే…
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే వారిని గాలికొదిలేసిన ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న ఏకైక కారణంతో సమయం, సందర్భం లేకుండా ఇలాంటి పనులేంటని నిలదీశారు. జనసేన పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్ వెళ్లే అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటుంటే ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేసి ఇలాంటి పనులపై దృష్టి…
ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటీవల కరోనా పాజిటీవ్ రావటంతో పవన్ ఐసోలేషన్ లోకి వెళ్ళి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. మూడు రోజుల క్రితం పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్స్ బృందం ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలు నిర్వహించింది. అందులో నెగెటీవ్ వచ్చిందని అయితే కరోనా తర్వాత పవన్ కొద్దిగా వీక్ గా ఉన్నారని ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని డాక్టర్ల బృదం తెలిపింది. అయితే…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల కూతురు ఆద్య బుల్లితెర ఎంట్రీ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఆద్య ఓ ఛానెల్ లో ప్రసారం అవుతున్న ‘డ్రామా జూనియర్స్’ షోలో పాల్గొని బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. తాజాగా సదరు షోకు సంబంధించిన ప్రోమో విడుదలవ్వగా… అందులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఆద్య. ‘డ్రామా జూనియర్స్’ షోకు రేణూ దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆద్య అలా వేదికపై కన్పించడంతో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, నివేతా థామస్, అంజలి కీలక పాత్రలు పోషించగా పవన్ కి జోడీగా శృతి హాసన్ కనిపించింది. ప్రకాష్ రాజ్ లాయర్ గా ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న…
మొన్న జరిగిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ పని చేసిందనే కొందరు అంటున్నారు. పని చేస్తే మరి పవన్ కళ్యాణ్ మద్దతు పలికిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు డిపాజిట్ కూడా ఎందుకని దక్కలేదు అని ప్రశ్నించవచ్చు. అయితే ఇక్కడే ఉంది అసలు సంగతి. 2019 లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకొని తన జనసేనతో ఎన్నికల బరిలోకి దిగారు. అప్పడు బీఎస్పీ పార్టీకి…
అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే… ఏప్రిల్ మాసంలో ‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం, ఇష్క్’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కమర్షియల్ మూవీస్ జనం ముందుకు రావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో ఒక్కసారిగా చిత్రసీమ కుదేలైంది. అయినా ఈ నెల కూడా డబ్బింగ్ తో కలిపి 17 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ మూడవ వారంలో థియేటర్లు మూసేస్తున్నారనే ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే కొన్ని థియేటర్లనూ మూసేశారు కూడా. కానీ ‘వకీల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఈ నెల 30న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన అన్ని సినిమాల కంటే ఫస్ట్ డే కలెక్షన్లలో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసుకుంది. అయితే… ప్రీమియర్ షోస్ అనుకున్న విధంగా పడకపోవడం, టిక్కెట్ రేట్ల పెంపుదలకు ప్రభుత్వాలు అంగీకరించకపోవడంతో ఈ సినిమా కలెక్షన్ల పై కొంత ప్రభావం పడింది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందాల్సిన ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘కోబలి’. రాయసీమ నేపథ్యంలో తెరకెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్ కు గతంలోనే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ తెలియని కారణాలతో ఈ చిత్రం కార్యరూపం దాల్చలేదు. 2013లో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం తరువాత ‘కోబలి’ సెట్స్ మీదకు వెళ్ళాల్సింది. కానీ ‘అజ్ఞాతవాసి’ వచ్చింది. తరువాత త్రివిక్రమ్… ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’…