పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించారు. ప్రస్తుతం పవన్ టాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పవన్ హీరోగా ఏఎం రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘హరి హర వీర మల్లు’, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా అయ్యప్పనమ్ కోషియం తెలుగు రీమేక్ లు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. తరువాత మైత్రి మూవీ మేకర్స్…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉదృతి కొనసాగుతోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ఏపీ ప్రభుత్వం స్కూల్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 9 వ తరగతి వరకు స్కూల్స్ కు సెలవలు ప్రకటించింది. అయితే, పదో తరగతి క్లాసులు యధావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొన్నది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కరోనా ఉదృతి సమయంలో టెన్త్ పరీక్షల నిర్వహణ ప్రభుత్వ…
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పవన్ త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా ప్రార్థిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి. గెట్ వెల్ సూన్… స్ట్రెంగ్త్ అండ్ ప్రేయర్స్’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే బ్రహ్మాజీ వంటి మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్లు చేశారు.…
కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అంతా మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు.. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు కూడా కరోనా వైరస్ సోకింది.. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత కాస్త నలతగా ఉండడంతో.. వైద్యుల సూచనల మేరకు కోవిడ్ టెస్ట్లు చేయించుకున్నారు.. అయితే,…
తెలుగు సినిమాల అసలు సిసలు స్టామినా ఏమిటో తెలిసేది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే. ఇక్కడ బొమ్మహిట్ అయితే బాక్సీఫీస్ బద్దలైనట్లే. మరి అలాంటి క్రాస్ రోడ్స్ లో తొలి వారం వసూళ్ళలో తాజాగా విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ పదో స్థానంలో నిలవటం విశేషం. తొలి వీకెండ్ లో దూకుడు చూపించిన ‘వకీల్ సాబ్’ వసూళ్ళు సోమవారం బాగా డ్రాప్ అయ్యాయి. అయితే మంగళవారం ఉగాది సందర్భంగా మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి.…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో ప్రకటించిన ‘అయినను పోయిరావలె హస్తినకు’ ప్రాజెక్ట్ ఆగిపోయిన విషయం తెలిసందే. దీంతో ఎన్టీఆర్ కొరటాలతో… త్రివిక్రమ్ మహేశ్ తో తమ తమ ప్రాజెక్టులను సెట్ చేసుకున్నారు. త్రివిక్రమ్-మహేశ్ సినిమా మే 31న హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆరంభం కానుంది. 2022 సమ్మర్ లో విడుదల కానుంది. ఇక మహేశ్ సినిమా తర్వాత త్రివిక్రమ్ జూనియర్ తో సినిమా చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం…
‘వకీల్ సాబ్’తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం పవన్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా…
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె, పాపులర్ సౌత్ హీరోయిన్ శృతి హాసన్ సినీ ఇండస్ట్రీలో నటిగా, గాయనిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబులపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా శృతి ట్విట్టర్లో #AskMeAnything సెషన్లో పాల్గొని, ఆమె అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. శృతి చాలా కాలం తరువాత సోషల్ మీడియాలో ఇంటరాక్టివ్ సెషన్లో పాల్గొనడంతో నెటిజన్లు…
పవన్ కళ్యాణ్ కేవలం పవర్ స్టార్ కాదు… జనసేనాని కూడా… అందువల్ల ఆచితూచి అడుగేస్తూ సమాజానికి ఉపయోగపడే కథలనే ఎంచుకుంటున్నారు… క్రిష్ డైరెక్షన్ లో పవన్ నటించే సినిమాలోనూ జనానికి మేలు చేసే పాత్రలోనే జనసేనాని కనిపించనున్నాడట… పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ పీరియడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’… పీరియడ్ మూవీస్ అంటే డైరెక్టర్ క్రిష్ కు ప్రాణం… ఇప్పటికే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి పీరియడ్ మూవీతో బిగ్ హిట్ సాధించాడు క్రిష్… ఇప్పుడు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. టాలీవుడ్ స్టార్స్ అందరూ ‘వకీల్ సాబ్’ టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడాడు. ఇప్పుడు పవన్ తాను రానాతో కలిసి నటించబోయే చిత్రంలో రాయలసీమ యాసలో మాట్లాడనున్నారట. మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి…