టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో “భీమ్లా నాయక్” ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” స్టార్మ్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. నిన్న “పవర్ స్టార్మ్” పేరుతో మేకర్స్ విడుదల చేసిన 24 గంటల్లో 10 మిలియన్ + వ్యూస్, 700కే ప్లస్ లైక్స్ వచ్చాయి. దేశంలోనే అత్యధిక వ్యూస్, లైక్స్ పొందిన టీజర్ గా “భీమ్లా నాయక్” టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. మలయాళ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిన్న విడుదలైన ‘పవర్ స్టార్మ్’ అంచనాలను మరింతగా పెంచింది. ఇప్పటికి ఈ టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది.
Read Also : లంకేశ్వరుడికి ప్రభాస్ బర్త్ డే విషెస్
ప్రస్తుతం కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీమేక్‌కు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ భార్యగా నిత్యా మీనన్ కీలక పాత్రలో నటించనుంది. “వరల్డ్ ఫేమస్ లవర్”లో చివరిసారిగా నటించిన ఐశ్వర్య రాజేష్ రానా సరసన జతకట్టనుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి రానాకు సంబంధించిన స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
10M+ views with 700k+ Likes in 24 Hours for #GlimpseofBheemlaNayak ⚡
— Sithara Entertainments (@SitharaEnts) August 16, 2021
Highest for a glimpse in india ~ #BheemlaNayak🔥
ICYMI ➡️ https://t.co/A25VE51Puy @pawankalyan @RanaDaggubati #Trivikram @MenenNithya @MusicThaman @saagar_chandrak @dop007 @NavinNooli @vamsi84 pic.twitter.com/oIy9cDx2UK