పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “అయ్యప్పనుమ్ కోషియమ్” తెలుగు రీమేక్. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్సె, టైటిల్ ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తామని ప్రకటించడం మెగా అభిమానులను హుషారెత్తించింది. ముందుగా చెప్పినట్టుగానే ఈరోజు తాజాగా సినిమా పోస్టర్ తో పటు పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. అందులో పవన్ లుక్, కొత్తగా లుంగీ కట్టడం, విలన్లను చితక్కొట్టడం కన్పిస్తోంది. ఫైటింగ్ లో హీరో దుమ్మురేపడమే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థమన్ కూడా అదరగొట్టేశాడు. అందరూ అనుకుంటున్నట్టుగానే సినిమాకు “భీమ్లా నాయక్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
Read Also : న్యూ లుక్ లో పవర్ స్టార్… పిక్ వైరల్
ఈ రీమేక్ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. స్టార్ కంపోజర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. నిత్యామీనన్ పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించనుంది. ఈ యాక్షన్ డ్రామాలో రానా దగ్గుబాటి సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి సినిమాలో నుంచి మొదటి పాటను సెప్టెంబర్ 2న విడుదల చేయబోతున్నారు.