రాజమండ్రిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపితే తనను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. కులాల పేరిట రాజకీయాలు చేయడం తగదని, ఒక వర్గాన్ని శతృవుగా చూడడం భావ్యం కాదని పవన్ పేర్కొన్నారు. జనసేన అంటే వైసీపీకి భయం ఉందని, దానికి ఇలాళ జరిగిన సంఘటనలే ఉదాహరణలు అని అన్నారు. సభకు వస్తున్న వారిని ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకుందని అన్నారు. తాను 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, రాజకీయాల నుంచి…
గాంధీ జయంతి రోజున జనసేన పార్టీ రాజమండ్రిలో శ్రమదానం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. శ్రమదానం కార్యక్రమం తరువాత భారీ మహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే, ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు కల్పించడంతో సభను రాజమండ్రిలోని వేరే ప్రాంతంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం ఆపలేదని, నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కుగా పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులను కాల రాయొద్దని అన్నారు. రాజకీయం అనేది…
రోడ్ల మరమ్మతుల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమం సెటైర్లు వేశారు ఏపీ మంత్రి శంకర్ నారాయణ.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.. పవన్‌ది ప్రశ్నించే పార్టీ కాదు.. ప్యాకేజీ తీసుకునే పార్టీ అని ఎద్దేవా చేసిన ఆయన.. జాతీయ రహదారిపై మాట్లాడక పోవడం విడ్డూరం.. రాష్ట్ర రహదారులపై మాట్లాడడం ఏంటి? అని ప్రశ్నించారు. వర్షాలు ఆగిన వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపడతామన్న ఆయన.. ఉనికి కోసం…
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోన్న జనసేన.. ఇవాళ శ్రమదానానికి పిలుపునిచ్చింది.. ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు జనసేన చీఫ్.. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. అసలు, పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ కోసం ఆంధ్ర వచ్చినప్పుడు రాజకీయాలు గుర్తుకువస్తాయంటూ ఎద్దేవా చేశారు.. గతంలో…
పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. చంద్రబాబు 5 ఏళ్ల హయాంలో రోడ్ల రిపేర్లకు వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని… అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు.. రోడ్లు ఎందుకు పూడ్చలేదని నిలదీశారు. ఇవాళ వచ్చి రెండు తట్టల మట్టి వేస్తే అయి పోతుందా ? అని ప్రశ్నించారు సజ్జల. కొండ ఎవరో ఎత్తు తుంటే చివరలో వేలు పెట్టి నేనే ఎత్తుతున్నాను అన్నట్లు ఉందని…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటనకు ఎలాంటి అడ్డంకులు లేవని చెబుతూనే.. ఏకంగా పవన్ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు పోలీసులు.. రాజమండ్రి క్వారీ సెంటర్‌కు పవన్ కల్యాణ్ కాన్వాయ్ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు.. పవన్ కాన్వాయ్ ను అడ్డుకోవద్దు అంటూ పోలీసులతో జనసైనికులు వాగ్వాదానికి దిగారు.. దీంతో, కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేనాని పవన్.. తన కారు టాప్‌పై కూర్చొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఆ తర్వాత…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు పవన్ కల్యాణ్ యువరాజ్యం అధినేతగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణలో పవన్ ప్రచారం చేయగా.. చిరంజీవి ఏపీలో ప్రచారం చేశారు. అయితే అనుకున్న రీతిలో ఆపార్టీకి నాడు ఫలితాలు రాలేదు. ఆ తర్వాత వైఎస్ మరణంతో కాంగ్రెస్ లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర విభజన తదితర అంశాలన్నీ కూడా ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడానికి కారణమయ్యాయి. చిరంజీవి…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బహిరంగ సవాల్ విసిరారు ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌కు దుమ్ముంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి గెలవాలని సవాల్ చేశారు.. తెలుగుదేశం పార్టీ తో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని సూచంచిన ఆయన.. 38 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకే ఒంటరిగా పోటి చేసే దమ్ము లేదు.. ఇక, జనసేన పార్టీ ఎంత? ఎన్నికల్లో పొత్తు లేకుండా ఎప్పుడైనా…
పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. అయితే, ఎన్ని ఆటంకాలు కల్పించినా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతాం అని ప్రశ్నించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. జనసేన కార్యక్రమానికే కోవిడ్ రూల్సా..? సీఎం జగనుకు కోవిడ్ రూల్స్ వర్తించవా..? అని మండిపడ్డారు.. సీఎం జగన్ ఈ రోజు విజయవాడ బెంజి సర్కిల్లో నిర్వహించే కార్యక్రమానికి కోవిడ్ రూల్స్ ఎందుకు వర్తింపచేయడం లేదని నిలదీసిన ఆయన.. విజయవాడను దిగ్బంధించి మరీ వేల మందితో చెత్త…