పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ భార్యగా నిత్యా మీనన్ నటిస్తోంది. రానా భార్యగా ఐశ్వర్యా రాజేష్ ను తీసుకున్నారు. అయితే ఆమె ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించలేక పోవడంతో ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో రానా దగ్గుబాటి సరసన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయాన్నీ సంయుక్త స్వయంగా వెల్లడించింది. తాజాగా చీరలో ఉన్న బ్యూటిపుల్ పిక్ ను షేర్ చేస్తూ మేకర్స్ ఈ విషయాన్నీ కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈరోజు నుంచి సంయుక్త సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.
Read Also : కన్నడ పవర్ స్టార్ కు గుండెపోటు
ఇక ఇప్పటికే “భీమ్లా నాయక్” సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీపావళి సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు “భీమ్లా నాయక్” చిత్రం 2022 జనవరి 12న బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది.