పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ “భీమ్లా నాయక్” ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా మరో హీరోగా నటిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిమించిన ఈ చిత్రం ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడిన విషయం తెలిసిందే. మలయాళంలో హిట్ అయిన “అయ్యప్పనుమ్ కోషియం” చిత్రానికి రీమేక్ అయిన “భీమ్లా నాయక్” ఫిబ్రవరి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో.. మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మధ్యలో కొద్దిగా సమయం దొరికింది అంటే ఆయన తన నలుగురు పిల్లలతో సమయం గడుపుతూ ఉంటారు. ఇప్పటివరకు పవన్ నలుగురు పిల్లలు ఒకే చోట ఉండడం చూడలేదు. పవన్ మొదటి భార్య ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య, రెండో భార్య అన్న లెజినావో ఇద్దరు పిల్లలు.. మొత్తం నలుగురు పిల్లలతో పవన్ సందడి చేసిన ఫోటో ఒకటి…
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని, త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పనిచేయాలని కోరుకుంటున్నానని పవన్ అన్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించే డాక్టర్లు, వైద్య సహాయకులు, వైద్య విద్యార్థులతో పాటు…
స్టార్ మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ “పుష్ప: ది రైజ్” మ్యూజిక్ తో అద్భుతమైన హిట్ సాధించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ “భవదీయుడు భగత్ సింగ్”కు బీట్స్ అందించడానికి సిద్ధం కాబోతున్నాడు దేవిశ్రీ. ‘పుష్ప’ హిట్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు ? అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది టాలీవుడ్ లో. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం “భవదీయుడు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఈ కరోనా మహమ్మారి కనుక విరుచుకుపడకపోయి ఉంటే .. ఈ పాటికి ఈ సినిమా థియేటర్లో రచ్చ చేస్తూ ఉండేది. కానీ, అభిమానులకు నిరాశే మిగిలింది. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న విడుదల తేదిని ఖరారు చేసుకుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి… త్వరలోనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తాననే ఈ మధ్యే ప్రకటించిన ఆయన.. ఇప్పుడు తాను పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ను అంటూ కామెంట్లు చేసి కొత్త చర్చకు తెరలేపారు.. ఇవాళ ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ కృష్ణరాజు ఇంటికి వచ్చిన ఏపీ సీఐడీ అధికారులు.. ఆయనకు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు.. ఆ తర్వాత మీడియాతో…
జనసేన కార్యనిర్వాహక సభ్యులతో పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరితో కలిసి చర్చించాకే వచ్చే ఎన్నికల్లో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నామన్నారు. రకరకాల పార్టీలు మనతోనే పొత్తు కోరుకోవచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం పొత్తుల కంటే ముందుగా పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపైనే కార్యకర్తలు ఫోకస్ పెట్టాలని సూచించారు. పొత్తులపై అందరిదీ ఒకే…
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకంతో పాటు ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రస్తుతం ఒక్కరోజులోనే లక్షలాది కేసులు వెలుగు చూస్తున్నాయని.. చూస్తుండగానే కరోనా సోకిన వారు మన చుట్టూ తిరుగుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. సంక్రాంతిని కుటుంబసభ్యులతో మాత్రమే జరుపుకోవాలని, బయటికెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. Read Also: సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు: వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి…
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ట్రోల్స్ కు ఎప్పటికప్పుడు తగిన రిప్లై ఇస్తూ వార్తల్లో నిలుస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ యంగ్ డైరెక్టర్ తాజాగా ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల హరీష్ ఓమిక్రాన్ వ్యాప్తి గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒక ప్రముఖ వైద్య నిపుణుడి వీడియోను పంచుకున్నారు. వైరస్ వ్యాప్తి పట్ల సామాన్యులు మరింత…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. సీని, రాజకీయ ప్రముఖులను సైతం కరోనా వెంటాడుతోంది. అయితే కరోనా సోకి దాని నుంచి బయటపడినవారికి సైతం మరోసారి కరోనా సోకుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేశ్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్, హీరో విశ్వక్సేన్ ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే తాజాగా నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థాణైంది. అయితే ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన…