Bheemla Nayak : ఆర్జీవీ రివ్యూ… ఏమన్నాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషనే అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ డైరెక్టర్ ‘భీమ్లా నాయక్’ రివ్యూ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో “భీమ్లా నాయక్”మేనియా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం నుంచి థియేటర్లలో “భీమ్లా నాయక్” సందడి చేస్తున్నాడు. మొదటి షో నుంచే సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే మెగా ఫ్యామిలీపై ఎప్పుడూ విమర్శలు కురిపించే ఆర్జీవీ తాజాగా పవన్ “భీమ్లా నాయక్” రివ్యూ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అసలు సినిమా ఎలా ఉందన్న విషయాన్ని వెల్లడిస్తూ ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
Read Also : Bheemla Nayak : జగన్ కక్ష సాధింపు చర్య… మూర్ఖత్వం వీడాలంటున్న చంద్రబాబు
Also Read
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
- Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
‘భీమ్లా నాయక్’ మూవీని ఉరుములతో పోలుస్తూ… పవన్ సునామీ లాంటివాడని, రానా దగ్గుబాటి పూర్తిగా అద్భుతమని ప్రశంసలు కురిపించారు. మొత్తం మీద ఈ మూవీ భూకంపం లాంటిదని చెప్పుకొచ్చాడు. అంతేకాదు “నేను పదే పదే చెబుతున్నట్లుగా ‘భీమ్లా నాయక్’ని హిందీలో కూడా విడుదల చేస్తే బాగుంటుంది. అది సంచలనం సృష్టించి ఉండేది” అంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరోవైపు వర్మ నిజంగానే ‘భీమ్లా నాయక్’ని పొగిడాడా ? లేదా ఇన్ డైరెక్ట్ గా ఏమన్నా సెటైర్లు వేశాడా ? అనేది అర్థంకాక చర్చ మొదలెట్టేశారు. మరి వర్మ ఈ కామెంట్స్ పాజిటివ్ గా చేశాడా ? లేక నెగెటివ్ గానా అన్నది ఆయనకే తెలియాలి.
The #BheemlaNayak is like a THUNDERSTORM..@PawanKalyan is like a TSUNAMI.. @RanaDaggubati is neck to neck ..Overall it’s an EARTHQUAKE 💪💪💪
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2022
Like I was repeatedly telling I so wish they released #BheemlaNayak in Hindi too ..It would have created an SENSATION
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2022
తాజావార్తలు
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?