Jagapathi Babu: ఆ సినిమా నుంచి నాకు హీరోయినే లేదు: జగపతి బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు మరోసారి తన మార్కు సెటైర్లతో వార్తల్లో నిలిచారు. ఆయన కీలక పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘వదలా’. ఆకెళ్ల వి.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ప్రెస్‌మీట్‌లో జగపతి బాబు సరదాగా చేసిన వ్యాఖ్యలు అందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి. ఈ సందర్భంగా జగపతి బాబు మాట్లాడుతూ.. తన సినిమాల్లో హీరోయిన్ల ప్రాధాన్యత గురించి ప్రస్తావించారు. “లెజెండ్ సినిమా నుంచి నాకు హీరోయినే లేకుండా పోయింది” అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా డజన్ల కొద్దీ హీరోయిన్లతో ఆడిపాడిన జగ్గు భాయ్, సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత పవర్‌ఫుల్ విలన్, క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితం కావడాన్ని ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారు.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఆసక్తి రేపుతున్న ‘వదలా’ గ్లింప్స్..
ఈ మూవీలో చేసిన యంగ్ హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ కళ్లు చాలా బాగుంటాయని అన్నారు. ఆమె తన కళ్లతోనే అద్భుతమైన నటన ప్రదర్శించింది అని కితాబు ఇచ్చారు. జగపతి బాబు, లయ, మరియు హృతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఒక విభిన్నమైన కథాంశంతో వస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత లయ ఈ సినిమాతో వెండితెరపై కనిపిస్తుండటం విశేషం. తమ్మారెడ్డి భరద్వాజ, కిశోర్ నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘వదలా’ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగపతి బాబు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారా లేదా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!