మరికొద్ది గంటల్లో ఓజీ ప్రీమియర్స్ పడతాయి. అనగా, టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న పైరసీ సైట్ ఐ బొమ్మ (బప్పాం) ఒక సంచలన పోస్టర్ షేర్ చేసింది. ఓజీ కమింగ్ సూన్ అంటూ తమ వెబ్‌సైట్‌లో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పోస్టర్ షేర్ చేసింది. వాస్తవానికి, ఈ వెబ్‌సైట్ కొన్ని రోజుల క్రితం వరకు కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన కంటెంట్స్ మాత్రమే పైరసీ చేసి తమ సైట్‌లో పెడుతూ వచ్చేది. కానీ, కొద్ది రోజుల క్రితం నుంచి టాలీవుడ్‌లో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాల థియేటర్ లేదా హెచ్‌డి ప్రింట్‌ను సైతం పైరసీ చేసి రిలీజ్ చేస్తోంది. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాను కూడా లీక్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది.
Also Read:Rithu Chowdary : హౌస్ లో ఇద్దరు కావాలా.. రీతూ ఏంటీ దరిద్రం..
సుజిత్ డైరెక్ట్ చేసిన ఓజీ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకు మునిపెన్నడూ లేనివిధంగా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కేవలం పవన్ అభిమానులే కాదు, యావత్ సినీ అభిమానులు అందరూ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్న సమయంలో ఐబొమ్మ ఇలా హెచ్చరించడం మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. అయితే, మరోపక్క, ఈ సినిమా టీమ్ పైరసీ లింక్స్ డిసేబుల్ చేయడానికి ఒక యాంటీ పైరసీ టీమ్‌ను కూడా సిద్ధం చేసినట్లుగా సమాచారం.