Sujith : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ ఫీవర్ మామూలుగా లేదు. ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ సినిమా డైరెక్టర్ సుజీత్ గురించి చాలా మందికి తెలియదు. సుజీత్ పవన్ కు పెద్ద అభిమాని. సుజీత్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రవళిక రెడ్డి అనే డెంటిస్ట్ ను చాలా కాలం పాటు ప్రేమించిన తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. 2020లో వీరిద్దరి వివాహం జరిగింది. ప్రవళిక హైదరాబాద్ లోనే టాప్ డెంటిస్ట్ అని తెలుస్తోంది.
Read Also : Coolie : కూలీలో మంచి పాత్ర ఇవ్వలేదు.. లోకేష్ పై నటి షాకింగ్ కామెంట్స్
ఓ ఈవెంట్ లో కలిసిన వీరిద్దరూ తర్వాత కాలంలో ఫ్రెండ్స్ అయ్యారు. సుజీత్ ఫస్ట్ మూవీ రన్ రాజా రన్ తీసే టైమ్ కు వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఆ మూవీ మంచి హిట్ అయిన తర్వాత సుజీత్ తన మనసులో మాట చెప్పి ప్రవళికను ఒప్పించాడు. సుజీత్ వ్యక్తిత్వం నచ్చిన ప్రవళిక వెంటనే ఒప్పేసుకుంది. ఇంకేముంది ఇద్దరూ మూడేళ్ల పాటు ప్రేమించుకుని 2020లో ఇరు కుటుంబాలను ఒప్పించి ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ప్రభాస్ హీరోగా సాహో సినిమా తీశాడు సుజీత్. ఆ మూవీ కల్ట్ ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది. కానీ మిగతా ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేదు. ఇక చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ సినిమా వస్తోంది. ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Read Also : Rithu Chowdary : హౌస్ లో ఇద్దరు కావాలా.. రీతూ ఏంటీ దరిద్రం..