రాజకీయ నాయకుడివే కాదు కనుక రెంటుకు పార్టీ పెట్టావు పవన్.. పోటీ చేయలేడు కాబట్టే పవన్ పార్టీ అద్దెకు పెట్టాడు అని ఎంపీ విమర్శలు గుప్పించారు. బీసీలను ఎక్కిరించిన చంద్రబాబు బీసీ తీర్పుతోనే జైలు కెళ్ళాడు అంటూ ఎంపీ నందిగం సురేష్ అన్నారు.
‘విలువలు లేని తమకే ఇది సాధ్యం’ అంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితో ఉన్న ఫోటో.. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో దిగిన ఫోటోలను మంత్రి ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
ఉమ్మడి మేనిఫెస్టో కోసం షణ్ముఖ వ్యూహం పేరిట 6 అంశాలను జనసేన పార్టీ ప్రతిపాదించింది. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా- ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక.. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేసేలా నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలనే అభిప్రాయానికి టీడీపీ-జనసేన పార్టీలు వచ్చాయి.
మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు.. నాలుగు నెలలో ఎన్నికలు రాబోతున్నాయి.. ధన వంతులు - పేదావాడికీ.. దొపిడీకీ - నిజాయితీ మధ్య వార్ జరుగుతోంది.. ప్రజలు చాలా గ్రహించాలి.. మళ్లీ టీడీపీ దోపిడీ పార్టీ ని రాకుండా చూడాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
వెనుక బడిన వర్గాలకు నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీలో సుపరిపాలన జరగకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు- పవన్ మధ్య భేటీ కొనసాగుతుంది. తెలంగాణ ఎన్నికలు సహా ఏపీలోని తాజా రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. త్వరలో టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి విస్తృత స్థాయీ సమావేశాల నిర్వహాణపై ప్రస్తావనకు వచ్చే ఛాన్స్.. సీఐడీ పెడుతోన్న వరుస కేసుల పైనా కూడా ఇరువురు చర్చించే అవకాశం.
Pawan Kalyan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో నవంబర్ 1 న ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఇక ఈ పెళ్ళికి మెగా, అల్లు కుటుంబాలతో పాటు సన్నిహితులు హాజరయ్యారు. ఇక పెళ్లి పనులు పూర్తికావడంతో ఒక్కొక్కరు ఇండియాకు బయలుదేరుతున్నారు.
Ram Charan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా, అల్లు కుటుంబాలతో పాటు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో మూడు ముళ్లు వేశాడు వరుణ్. ఇక గత వారం నుంచి మెగా ఇంటి పెళ్లి సందడి నుంచి ఫోటోలు రావడం.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరుగుతూనే ఉంది.