TDP-Vellampalli Srinivasa Rao: 3న చర్చకు సిద్ధమంటూ.. వెలంపల్లి సవాలును స్వీకరించిన టీడీపీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు విసిరిన సవాలును టీడీపీ స్వీకరించింది. ఆర్యవైశ్యులకు ఎవరేం చేశారోననే దానిపై వచ్చే నెల 3వ తేదీన చర్చకు రావాలని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ పేర్కొన్నారు. ఆర్యవైశ్యులకు టీడీపీ ఏం చేసిందో, జగన్ ప్రభుత్వం ఏం చేసిందో వివరించటానికి తాము సిద్దమని, డిసెంబర్ 3న ఉదయం 11.30గంటలకు విజయవాడ వన్ టౌన్ లో కొత్తగుడుల కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో చర్చకు రావాలని సవాల్ స్వీకరించారు.
‘దమ్ముంటే వెలంపల్లి శ్రీనివాసరావు చర్చకు రావాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తోంది. ఆర్యవైశ్యులపై కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోంది. వైశ్యుల్లో చీలికలు తెచ్చి.. వైశ్యులకు ఓటు బ్యాంకే లేదనేలా వ్యవహరిస్తోంది. ఆర్యవైశ్యుల్లోని కోమటి, గుప్త, శెట్టిలు ఆర్యవైశ్యులే. వారిని విభజించడం తగదు. 723 కులాల పేర్లల్లో ఆర్యవైశ్య కులం పేరు లేకపోవడం బాధాకరం. వైసీపీలోని ఆర్యవైశ్య నాయకులు ఎందుకు నోరు పెదపడంలేదు?. 14,600 మంది పేద వైశ్యులు సత్యనారాయణ వ్రతం చేసుకునేందుకు అడ్డంకులు సృష్టించడం తగదు’ అని డూండీ రాకేష్ అన్నారు.
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
Also Read: RK Roja: చంద్రబాబు పురాతన దేవాలయాలు కూల్చి.. బాత్‌రూంలు కట్టాడు!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు ఎమ్మెల్యే వెలంపల్లి ఛాలెంజ్ విసిరారు. ఆర్యవైశ్యులకు తాను ఏం అన్యాయం చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నానని, టీడీపీ ఆపీస్‌కు రమ్మన్నా కూడా తాను సిద్ధమే అంటూ సవాల్ చేశారు. ఆర్యవైశ్య సంఘాల ముసుగులో తనను ఇబ్బందిపెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య వైభవం కార్యక్రమం జరగకుండా వెల్లంపల్లి అడ్డుకుంటున్నారని టీడీపీ, జనసేన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన సవాల్ విసిరారు. ఈ సవాల్ టీడీపీ స్వీకరించింది.
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!