Pawan Kalyan: తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన కూడా పలు చోట్ల ఎన్నికల బరిలో నిలిచింది.
వరంగల్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కావాలనుకుంటున్నానని.. బీసీలకు సాధికారికత తెలంగాణ కోరుకున్నామని తెలిపారు. ధన బలం లేకున్నా.. మీ ధైర్యం, మీ సహకారంతో జనసేన నడిపిస్తూ వస్తున్నానని చెప్పారు. 2014లో మోదీని ప్రధానిగా చూడాలని ఆయనకు అప్పుడు బలంగా మద్దతు ఇచ్చానన్నారు. అదే స్ఫూర్తితో ఈసారి కూడా ఇక్కడి బీజేపీ నేతలకు అదే…
ఏపీలో జనసేన పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జి సందీప్ రాయల్‌తో పాటు రాయలసీమ రీజియన్ ఇంఛార్జి పద్మావతి పసుపులేటిలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సజ్జల రామకృష్ణారెడ్డి. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హర్బర్‌లో ప్రమాదంపై విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారణ కొనసాగుతున్న విషయం తెల్సిందే. యూట్యూబర్ లోక ల బాయ్ నాని తన భార్య సీమంతం పార్టీని బోట్ లో గ్రాండ్ గా నిర్వహించడం వలనే ఆ అగ్నిప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ అగ్నిప్రమాదాన్ని సైతం వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడంతో లోకల్ బాయ్ నానిపై కేసు నమోదయ్యింది.
ఈనెల 25న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో బీజేపీ-జనసేన నిర్వహించే బహిరంగ సభ కోసం ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ గౌడ్ పేర్కొన్నారు.
Pawan Kalyan: ఉమ్మడి వరంగల్ జిల్లాపై ఇప్పటికే దృష్టి సారించిన బీజేపీ.. ఈ నెల 22న వరంగల్ లో ప్రచారానికి పవన్ కల్యాణ్ ను పంపుతోంది. దీంతో పాటు వీలైతే వరంగల్ పశ్చిమతోపాటు తూర్పు నియోజకవర్గంలో కూడా రోడ్ షోలు నిర్వహిస్తామని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘ఓజీ’. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో మూవీ దర్శకుడు సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను డివివి దానయ్య సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ…